Marriage: పెళ్లిపీటలెక్కబోతున్న మరో కుర్ర హీరో.. ఫిబ్రవరిలోనే వివాహం?
టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. సెలబ్రెటీలు అంతా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వరుణ్ తేజ్ లావణ్య పెళ్లికి అంతా రెడి అయిపోయింది. మరోవైపు వెంకటేష్ కూతురు నిశ్చితార్థం కూడా జరిగింది. ఇంకోవైపు కీరవాణి కుమారుడు శ్రీసింహ పెళ్లి మురళిమోహన్ మనవరాలితో ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో సెలబ్రిటీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన ఎవరో కాదు.. దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి. ఎవరితో వివాహం.. ఎప్పుడు పెళ్లి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ లో వరుస పెళ్లి వేడుకలు జరగనున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే ఈ హీరో పెళ్లికి అంతా సిద్ధం అయింది. నవంబర్ 1న వరుణ్ తేజ్... లావణ్య త్రిపాఠితో ఏడు అడుగులు వేయబోతున్నాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీకి బయలుదేరింది. అతికొద్ది మంది కుటుంబ సభ్యుల నడుమ వీరి వివాహం జరగనుంది. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఇక నవంబర్ 5న హైదరాబాద్ లో రిసెప్షన్ ఉండనుంది.

మరోవైపు వెంకటేష్ రెండో కూతురు హయవాహిని నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగిపోయింది. మరోవైపు కీరవాణి తనయుడు శ్రీసింహ పెళ్లి కూడా మురళీమోహన్ మనవరాలు రాగతో జరగబోతున్నట్టు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. తాజాగా టాలీవుడ్ లో మరో పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నట్లు సమాచారం.

దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా నిర్మాణ రంగంలోకి వచ్చి.. సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన టాలీవుడ్ కు సుపరిచితమే. శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి పెళ్లి చేయబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇటీవల రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్. త్వరలోనే సెల్ఫిష్ అనే మరో సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే త్వరలోనే ఆశిష్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్.
ఇక ఇటీవల దిల్ రాజ్ వాళ్ల నాన్న మరణించిన సంగతి తెలిసిందే. చావు జరిగిన ఇంట్లో శుభకార్యం జరిగితే మంచిదని అంటారు కాబట్టి.. ఆశిష్ పెళ్లి చేయాలని అనుకున్నారట. ఆశిష్ కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... ఆయన పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త కూతురితో ఆశిష్ వివాహం జరగనుందని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఇక వీరి పెళ్లి ఫిబ్రవరిలో జరగనుందని టాక్.

ఇక ఆశిష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇక మొదటి సినిమాతోనే అందరి దృష్టించిన ఆశిష్.. త్వరలోనే సెల్పిష్ అనే చిత్రంతో వస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి కాశీ విశాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, 'దిల్' రాజు, శిరీష్‌ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











