'అజ్ఞాతవాసి'పై దిల్ రాజుకు హైటెన్షన్: ఆ మార్క్ దాటకపోతే దారుణంగా దెబ్బయిపోతాడు?..
Recommended Video

పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు 'అజ్ఞాతవాసి' ఫీవర్‌లో ఉన్నారు. ఎప్పుడెప్పుడు తెరపై పవన్ బొమ్మ చూద్దామా!.., ఎక్కడ టికెట్ బుక్ చేసుకుందామా? అన్న ఆత్రుతలో మునిగిపోయారు. ఫ్యాన్స్ సంగతిలా ఉంటే.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కలెక్షన్ల లెక్కల్లో మునిగిపోయారు. ఈ సినిమాకు నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న దిల్ రాజు మాత్రం ఒకింత ఆందోళనలో ఉన్నారట. ఇంతకీ దిల్ రాజు టెన్షన్‌కు కారణమేంటి?..

ట్రేడ్ టాక్..:
సాధారణంగానే నైజాం ఏరియాలో.. ఏ పెద్ద సినిమా వచ్చిన డిస్ట్రిబ్యూషన్‌కు దిల్ రాజు ముందు ఉంటారు. అదే పరంపరలో అజ్ఞాతవాసి సినిమాను కూడా ఆయన భారీ రేటుకు కొనుగోలు చేశారు. దాదాపు రూ.28.5కోట్లు చెల్లించి ఆయన అజ్ఞాతవాసి సినిమా తీసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాల భోగట్టా.

ఇన్‌సైడ్ టాక్..:
అజ్ఞాతవాసిపై అంత భారీగా ఖర్చు చేసిన దిల్ రాజు.. ఎంత లేదన్నా రూ.30కోట్లు వస్తే గానీ సేఫ్ సైడ్ లోకి రారు. అయితే సంక్రాంతి పండుగ కావడం.. ఎక్కువమంది యువత ఊళ్లకు తరలిపోయే అవకాశం ఉండటంతో.. కలెక్షన్ లెక్కలపై తర్జన భర్జన పడుతున్నారట దిల్ రాజు. పైగా అజ్ఞాతవాసికి పోటీగా రెండు రోజుల వ్యవధిలో బాలయ్య జైసింహా కూడా వస్తుందడం కలెక్షన్లపై ప్రభావం చూపుతుందేమో అనుకుంటున్నారట.

90శాతం థియేటర్లలో..:
సంక్రాంతికి ఇంటిల్లిపాదీ ఊళ్లకు తరలిపోయే జనాలు వారం దాటితే గానీ హైదరాబాద్ చేరుకోరు. కాబట్టి ఈలోపే వీలైనంత ఎక్కువ షోలతో అజ్ఞాతవాసిని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారట దిల్ రాజు. దాదాపు సిటీ వ్యాప్తంగా 90శాతం థియేటర్లలో అజ్ఞాతవాసినే ప్రదర్శించేలా ప్లాన్ వేస్తున్నారట.

బాహుబలి లాగే..:
బెనిఫిట్ షోలతో పాటు.. విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షోలతోను వీలైనంత ఎక్కవ కలెక్షన్స్ రాబట్టాలని యోచిస్తున్నారట. అనుమతి రావడమే ఆలస్యం భారీ రేట్లతో టికెట్ల అమ్మకాలు చేపట్టాలనుకుంటున్నారట.

ఆ ఎఫెక్ట్‌తో ఆందోళన:
బాలయ్య 'జైసింహా', సూర్య 'గ్యాంగ్' చిత్రాలు అజ్ఞాతవాసికి పోటీగా వస్తుండటం.. వరుస సెలవుల నేపథ్యంలో సినిమా కలెక్షన్లపై ఓ అంచనాకు రాలేకపోతున్నారట దిల్ రాజు. ఎలాగైనా సరే, రూ.30కోట్ల మార్కును క్రాస్ చేస్తే భారీ లాభాలు వస్తాయనుకుంటున్నారట. అయితే ఆ రూ.30కోట్ల మార్క్ క్రాస్ చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సవాల్‌తో కూడుకున్నదే కావడంతో దిల్ రాజు ఆందోళన చెందుతున్నారట.


Click it and Unblock the Notifications











