పవన్ కళ్యాణ్ ని అడ్డం పెట్టుకునే బిజినెస్
పవన్ కళ్యాణ్ పేరు చెపితే చాలు భాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రద్దలు అవుతున్నాయి. ఆయన డేట్స్ కోసం నిర్మాతలు,దర్శకులు లైన్లో నిలుచుంటున్నారు. అయితే ఆయన పేరు చెప్పి ఎవరు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు అంటే బండ్ల గణేష్ అంటున్నారు. ఫిల్మ్ నగర్ లో ఈ విషయమై గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ రన్ అవుతోంది. పవన్ తో స్నేహం బండ్ల గణేష్ కి బాగా కలిసి వస్తోంది అంటున్నారు.
పవన్ తో సినిమాలు చేయాలనుకునే వాళ్లు బండ్ల గణేష్ తో మంచి గా ఉండి అతనితో టచ్ లో ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ డేట్స్ కావాలనుకున్న దర్శకులు గణేష్ ని సంప్రదిస్తున్నారని వినికిడి. పెద్ద పెద్ద దర్సకులు సైతం గణేష్ తో పవన్ నిమిత్తం మంతనాలు జరుపుతున్నాడని,అయితే గణేష్ మాత్రం తాను ఏ నిర్ణయం తీసుకోలేనని పవన్ కి ఓ మాట చెప్పలగని తప్పించుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు.
ఇక పూరి జగన్నాధ్ కి సైతం పవన్ తో ప్రస్తుత చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు ఓకే అవటానికి కారణం గణేష్ అని చెప్తున్నారు. దానికి తోడు పవన్ తో మరోసారి గణేష్ చిత్రం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే డైరక్టర్ ఎవరనేది తెలియలేదు. దాంతో దర్సకులు చాలా మంది ఆ అవకాసం తమకే రావాలని గణేష్ ని కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా గబ్బర్ సింగ్ దర్సకుడు గణేష్ ఇప్పుడు సెంటర్ ఆప్ ది ఇండస్ట్రీగా మారాడని పెద్ద నిర్మాతలు సైతం కామెంట్ చేస్తున్నారు.
ఇలా పవన్ ప్రత్యేకంగా గణేష్ తో రిలేషన్ మెయింటైన్ చేయటానికి కారణం..గణేష్ అంటే ఉన్న నమ్మకం అని చెప్తారు. గణేష్ లోని నిజాయితి,ఇచ్చిన మాటను ఎట్టి పరిస్దితుల్లోనూ నిలబెట్టుకునే విధానం పవన్ కి నచ్చాయని అంటారు. దానికి తోడు గణేష్.. పవన్ కి వీరాభిమాని. ఇవన్నీ గణేష్ ని ఈ రోజు ఇండస్ట్రీలో నిలబడి.. బిజినెస్ చేసే పెద్ద నిర్మాత స్ధాయికి ఎదిగేలా చేసాయంటున్నారు.


Click it and Unblock the Notifications











