నిర్మాతకు లవర్స్ డే సెంటిమెంట్...అందుకే
హైదరాబాద్: వాలంటైన్స్ డే రోజు అంతటా కలర్ ఫుల్ గా ఉషారు ఉషారుగా ఉంటుంది. అందుకే కొందరు నిర్మాతలు తమ చిత్రాలను అదే రోజు రిలీజ్ పెట్టుకోవటానికి ఆసక్తి చూపుతూంటారు. ముఖ్యంగా లగడపాటి శ్రీధర్ తొలి నుంచీ వాలంటైన్స్ డే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ వస్తున్నారు. ఆయన తన చిత్రాలు అదే రోజున విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన నిర్మించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రాన్ని సైతం అదే రోజున విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
https://www.facebook.com/TeluguFilmibeat
సుధీర్‌బాబు, నందిత జంటగా నటించిన సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడంలో ఘనవిజయం సాధించిన 'చార్మినార్'కి ఇది రీమేక్. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, శిరీష ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కన్నడ వెర్షన్‌కి దర్శకుడైన ఆర్. చంద్రు తెలుగు వెర్షన్‌నీ డెరైక్ట్ చేసారు.
సుధీర్ బాబు మాట్లాడుతూ ''ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ వినోద ప్రధానమైనవే. ఈ సినిమా వాటికి భిన్నంగా పాత రోజుల్ని గుర్తు చేసేలా ఉంటుంది'' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''కుటుంబం, స్నేహితులు, ప్రేమ.. ఈ అంశాల మధ్య కథ నడుస్తుంది. కృష్ణమ్మకు సినిమాకు సంబంధమేంటనేది తెరపై చూడాల్సిందే'' అన్నారు.
నిర్మాతలు లగడపాటి శిరీష, శ్రీధర్ మాట్లాడుతూ ‘‘మా సంస్థను ప్రారంభించి జనవరి 21కి పదేళ్లవుతాయి. ఈ సందర్భంగా వైవిధ్యమైన సినిమాను రూపొందిస్తున్నాం. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఓ సినిమాను రూపొందిస్తున్నాం. గతంలో వచ్చిన ‘మరో చరిత్ర', ‘ప్రేమ పావురాలు' తరహా సినిమా ఇది. చంద్రు కన్నడలో వరుస విజయాలను సాధించిన దర్శకుడు. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.
'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రంలో మహేష్ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ''ఈ చిత్రంలో మహేష్‌బాబు పాత్ర ప్రత్యేకంగా, ఆసక్తిగా ఉంటుంది. ఆయన కథ చెప్పగానే నటించడానికి అంగీకరించారు. ఆయన ఈ చిత్రాన్ని అంగీకరించడంలో సుధీర్‌బాబుది కీలక పాత్ర. మహేష్ అభిమానులకు నచ్చేలా ఆయన పాత్ర ఉంటుంది'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
సినిమాలో గిరిబాబు, ఎమ్మెస్ నారాయణ, సారిక రామచంద్రరావు, చిట్టిబాబు, కిషోర్‌దాస్, అభిజిత్ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: హరి, మాటలు: ఖదీర్‌బాబు, ఛాయాగ్రహణం: కె.ఎస్.చంద్రశేఖర్, కళ: నారాయణరెడ్డి


Click it and Unblock the Notifications











