twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాస్ట్లీ కారు కొన్న 'అరవింద సమేత' నిర్మాత.. నంబర్ కోసమే 10 లక్షలు, ఎన్టీఆర్ కోసం అంటూ!

    |

    Recommended Video

    Producer Radhakrishna Gifts Costly Car To NTR

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ ఎన్టీఆర్ కు కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    అరవింద సమేత షూటింగ్

    అరవింద సమేత షూటింగ్

    ప్రస్తుతం అరవింద సమేత చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ చిత్రంలో త్రివిక్రమ్ బలమైన యాక్షన్ సన్నివేశాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

    సోషల్ మీడియాలో వైరల్ న్యూస్

    సోషల్ మీడియాలో వైరల్ న్యూస్

    ఈ చిత్ర నిర్మాత రాధాకృష్ణ ఎన్టీఆర్ కు గిఫ్ట్ గా రేంజ్ రోవర్ కారు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కు ఇప్పటికే 9999 నంబర్ తో రేంజ్ రోవర్ కారు ఉంది. ఎన్టీఆర్ మామ ఈ కారుని ఇచ్చారు. ఇదే నంబర్ తో రాధాకృష్ణ రేంజ్ రోవర్ కారు కొన్నారట.

    నంబర్ కోసమే 10 లక్షలు

    నంబర్ కోసమే 10 లక్షలు


    న్యూమరాలజీ మీద నమ్మకంతో రాధాకృష్ణ ఈ కారు నంబర్ కోసమే 10 లక్షలు వెచ్చించినట్లు తెలుస్తోంది. వేలంలో 10 లక్షలు పెట్టి 9999 నంబర్ దక్కించుకున్నారట. ఇక రేంజ్ రోవర్ కారు ధర 1.3 కోట్లుగా తెలుస్తోంది.

    ఎన్టీఆర్ కోసమే, కొందరేమో

    ఎన్టీఆర్ కోసమే, కొందరేమో

    ఖర్చు చేసి నిర్మాత ఈ కారు కొన్నది ఎన్టీఆర్ కు గిఫ్ట్ గా ఇచ్చేందుకే అని చిత్ర యూనిట్ నుంచి వార్తలు వస్తున్నాయి. మరి కొందరేమో తనతో వరుసగా చిత్రాలు చేస్తున్న త్రివిక్రమ్ కి బహూకరించాడు అని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

    English summary
    Producer Radhakrishna gifts costly car to NTR. Radhakrisha is prodecer for Aravindha Sametha movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X