శ్రీను వైట్లకు డి.సురేష్ బాబు మెగా ట్విస్ట్?
శ్రీను వైట్లతో, సురేష్ బాబు సమర్ఫణలో నమో వెంకటేశ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెమ్యునేషన్ నిమిత్తం శ్రీను వైట్ల ఐదు కోట్లు అడిగారు. అయితే సురేష్ బాబు...తెలివిగా వ్యవహిరించి శ్రీను వైట్లను కూడా నిర్మాతల్లో ఒకడిగా..లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పించారు. ఇప్పుడయితే కేవలం ఐదు కోట్లే వస్తాయని, అదే రిలీజయితే తన వాటాకు దాదాపు ఎనిమిది కోట్లు వరకూ వర్కవుట్ అవుతుందనే నమ్మకంతో శ్రీను వైట్ల ఓకే అన్నారు. సురేష్ బాబుకి మరో ఉద్దేశ్యం కూడా ఉంది. సినిమా నిర్మాణంలో అతనూ భాధ్యత వహిస్తే..అనవసర ఖర్చు తగ్గి, లాభాపేక్షతో మరింత కసిగా సినిమాపై వర్క్ చేస్తాడని నమ్మకం. అయితే సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుని, యాభై రోజులకే కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. దాంతో లాభంలో వాటాగా శ్రీనువైట్లకు కేవలం కోటిన్నర వరకూ ముట్టిందని సమాచారం. అత్యాసకు వెళ్ళినందుకు శ్రీను వైట్లకు ఇట్లా జరిగిందని సినీ వర్గాలు కామెంట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల..మహేష్ బాబు కాంబినేషన్ లో చేయబోయే చిత్రం కోసం స్క్రిప్టుని వండుతున్నారు. సురేష్ బాబు..తన కుమారుడు రానా కోసం సెల్వరాఘవన్ తో సినిమా చేస్తూ ఆ బిజీలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











