కాజల్ ని అడ్వాన్స్ లు తిరిగి ఇమ్మంటున్న నిర్మాతలు
ఒక సినిమా హిట్టయితే ఆ హీరో, హీరోయిన్ ఇంటి ముందు క్యూ కట్టడం, మరో సినిమా ప్లాఫ్ అయితే తిరిగి అడ్వాన్స్ లుగా ఇచ్చిన మొత్తాలని రాబట్టుకోవటానికి అదే ఇంటి ముందు ఆవేశంగా మరో మారు క్యూ కట్టడం కామన్ అయిపోయింది. ప్రస్తుతం ఆ డార్క్ సైడ్ ని కాజల్ ఎదుర్కొంటోందని వినికిడి. మగధీర విజయంతో ఆమె రెమ్యునేషన్ కోటికి పెంచేసి, పోటీపడి అడ్వాన్స్ లు పట్టుకుని ఆమె గుమ్మం ముందు వాలిపోయిన నిర్మాతలు ఆమె తర్వాత చిత్రం గణేష్ పరాజయంతో అడ్వాన్స్ లు తిరిగి ఇమ్మని వెనకపడుతున్నారని తెలుస్తోంది. అందుకోసం తమ పరిచయాలతో రికమండేషన్స్ సైతం చేయిస్తున్నారని చెప్తున్నారు. అలాగే కాజల్ నటించిన తమిళ్ చిత్రం నాన్ మహాన్ అల్లా కి పంపణీదారులు కూడా కనపడటం లేదు. దాంతో డిమాండ్ ఉన్నప్పుడే డబ్బు దండుకోవాలనే కాజల్ ఆలోచనలకి, ఆశలకీ గండిపడినట్లే అంటున్నారు. అయితే మరో సక్సెస్ వస్తే ఇవన్నీ గాలిలో మబ్బుల్లా తేలిపోతాయని, ఆమె శ్రేయాభిలాషులు ఆమెకు ధైర్యం చెపుతున్నారు.


Click it and Unblock the Notifications











