‘టి’సమ్మె : దూకుడు నిర్మాతల గుండెల్లో గుబులు
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సకల జనుల సమ్మె, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 23న విడుదల కాబోతున్న దూకుడు సినిమాకు కష్టాలు తప్పేట్లు కనిపించడం లేదు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన దూకుడు చిత్ర నిర్మాతలు తెలంగాణ వాదుల నుంచి తమ సినిమాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. నిర్మాతల విన్నపంపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు, పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు, సమంత జంటగా నటిస్తున్న దూకుడు చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్నాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూ సూద్, షాయాజీ షిండే, నాజర్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, చంద్రమోహన్, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తుండగా...థమన్, కె.వి. గుమన్, గోపీ మోహన్, కోన వెంకట్, కోటి పరుచూరి, ఎ.ఎస్. ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, రామజోగయ్య శాస్త్రీ, భాస్కరభట్ల, విశ్వ సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











