twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలసుబ్రమణ్యంపై బడా నిర్మాతల రుసరుస

    By Bojja Kumar
    |

    ఇటీవల శ్రీరామ రాజ్యం 50 రోజుల వేడుక సందర్భంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రసంగిస్తూ....తెలుగులో రామానాయుడు లాంటి బడా నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలు మాత్రమే తీస్తున్నారు. వాటితో పాటు శ్రీరామ రాజ్యం లాంటి మంచి సినిమాలు సంవత్సరానికి కనీసం ఒక్కటైనా తీయండి అంటూ ఉచిత సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ఇలాంటి సినిమాలు తీసి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచండి అనే అర్థం వచ్చేలా బాలు స్పీచ్ ఇచ్చారు. బాలు అలా మాట్లాడటంతోనే రామానాయుడు, ఇతర నిర్మాతల మొహాలు ఎర్రబడ్డాయి.

    తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం....బాలు వ్యాఖ్యలపై బడానిర్మాతలంతా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి సినిమాలకు యవత ఆదరణ లేనప్పుడు తెలిసి చేతులు కాల్చుకుంటామా?, మేం చేసేది వ్యాపారమే, బాలు లాంటి వారు మాటలు ఎన్నయినా మాట్లాడతారు. రెమ్యూనరేషన్ విషయంలో రూపాయి కూడా నష్టపోవడానికి ఇష్టపడని బాలసుబ్రమణ్యం ఊకదంపుడు ఉచిత సలహాలు ఎన్నయినా ఇస్తారు? ఆయన సొమ్మేంపోతోంది అంటూ నిర్మాతలు రుసరుసలాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

    English summary
    "Balu never compromises on payment. He never loves to lose money. But he suggests producers to lose money and do films. We are not here for charity. We are here for business", said a producer discussing in film nagar club last night. In fact, free advises sometimes result in insults.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X