Project K: ప్రభాస్ సినిమాలో మరో ఇద్దరు అగ్ర హీరోలు.. డామినేట్ చేసే పాత్రల్లోనే..?

నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తదుపరి సినిమాలు చాలా ఆసక్తికరంగా మారిపోతున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు కథల పరంగా అయితే చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. వేటికవే విభిన్నంగా ఉండేవిధంగా ప్రభాస్ కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇక అతని సినిమాలలో ఇతర స్టార్స్ టాలెంటెడ్ నటీనటులు కనిపించడం మరింత అంచనాలను పెంచేస్తోంది. ఇక త్వరలోనే ప్రాజెక్టు K లో లో కూడా మరొక ఇద్దరు ప్రముఖ హీరోలు ప్రత్యేకమైన పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక ఆ స్టార్స్ ఎవరూ అనే వివరాల్లోకి వెళితే..

ఫ్లాప్స్ వచ్చినా తగ్గని రేంజ్

ఫ్లాప్స్ వచ్చినా తగ్గని రేంజ్

రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇప్పుడు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్నాయి. అతని ఫ్లాప్ సినిమాలు కూడా మొదటి రోజు ఊహించని విధంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకుంటున్నాయి. బాహుబలి సినిమా తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత రాబోయే సినిమాలు మాత్రం తప్పకుండా అంచనాలకు తగ్గట్టుగా ఉంటాయి అని అనిపిస్తుంది.

 ముందుగా 3D మూవీ

ముందుగా 3D మూవీ

ప్రభాస్ వరుసలో ముందుగా రామాయణం బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఆదిపురుష్ సినిమా పూర్తిగా త్రీడీలో హైటెక్నాలజీతో రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ పూర్తయ్యాయి. ఇక ప్రస్తుతం దర్శకుడు గ్రాఫిక్స్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ పనులు అయిపోతే రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి సినిమాను జనవరి కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ K

బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ K

ప్రభాస్ లిస్టులో ఉన్న మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టు K పై కూడా అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహానటి తర్వాత టాలెంటెడ్ దర్శకుడు నాట్ అశ్విన్ తెరపైకి తీసుకురాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే లెజెండ్ యాక్టర్ అమితాబచ్చన్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం 500 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్

ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం ప్రముఖ హీరోలను కూడా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక లిస్టులో ఇటీవల దర్శకుడు దుల్కర్ సల్మాన్ ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. టైం ట్రావెలింగ్ కు సంబంధించిన సినిమా కావడంతో దుల్కర్ సల్మాన్ ఒక మంచి పాత్ర చేసేందుకు ఒప్పుకున్నాడట. వైజయంతి మూవీస్ లో సీతారామం సినిమా చేసిన దుల్కర్ ఇలాంటి అవకాశం వస్తే ఎంత మాత్రం నో చెప్పడు అని చెప్పవచ్చు.

తమిళ్ హీరో కూడా..

తమిళ్ హీరో కూడా..

తమిళ హీరో సూర్య పేరు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆయన కూడా ప్రాజెక్టు K లో ఒక కీలకమైన గెస్ట్ పాత్రలో కల్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం యూవి క్రియేషన్స్ లోనే సూర్య ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ప్రభాస్ తో ఆయనకు మంచి అనుబంధమే ఉంది. వైజయంతి మూవీస్ అంటే తప్పకుండా సినిమా చేసేందుకు అవకాశం అయితే ఉంది. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్లో తెరపైకి వస్తున్న సినిమా కాబట్టి ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర అంటే ఆయనకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ ఇద్దరు నటీనటులు ఈ సినిమాలో నిజంగానే నటిస్తున్నారా లేదా అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X