Project K: ప్రభాస్ సినిమాకు మరో టైటిల్.. K అంటే అసలైన అర్థం అదా.. యుద్ధం పేరునే పెడుతున్నారా!
తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా తనదైన టాలెంట్లతో సత్తా చాటిన అతడు.. గ్లోబల్ స్టార్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ జోష్‌లోనే వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో 'Project K' ఒకటి. తాజాగా ఈ మూవీ టైటిల్ గురించి మరో ఆసక్తికరమై న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!
ప్రాజెక్టు K.. పాన్ వరల్డ్ రేంజ్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రమే 'Project K'. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో దీపిక పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

బ్రేకులతోనే.. అంతే పూర్తైందిగా: అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'Project K' సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌తో తీస్తున్నారు. అందుకు తగ్గట్లే దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుం ఇప్పటికీ సగం షూటింగ్‌ను మాత్రమే పూర్తి చేసుకున్నారు.

టైం ట్రావెల్.. అన్ని కోట్ల బడ్జెట్: 'Project K' మూవీని టైం ట్రావెల్ స్టోరీతో నడుస్తుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అంతేకాదు, ఇందులో టైం మెషీన్ యుగాలనే దాటి వెళ్లిపోతుందట. అంటే గతానికి, భవిష్యత్‌కు ముడి పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు రూ. 600 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా హై రేంజ్ టెక్నికల్ వ్యాల్యూస్‌తో దీన్ని రూపొందిస్తున్నారు.
K టైటిల్.. అక్కడే రివీల్ చేసి: ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు Project K అనే పేరును పెట్టింది. దీంతో ఇదే ఫైనల్ అని అంతా అనుకున్నారు. కానీ, ఈ పేరు కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. ఇక, ఇందులో K అంటే ఏంటి అనే దానిపై అమెరికా కాలిఫోర్నియాలోని సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‌లో క్లారిటీ ఇవ్వబోతున్నారు.

K అంటే ఏంటి? ఆ పేర్లతోనే: Project K కాకుండా మరో టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ఇదే పాపులర్ అవడంతో ప్రాజెక్టు పక్కన ఉన్న 'K' అక్షరానికి మాత్రం అర్థం వచ్చేలా పేరు పెట్టబోతున్నారు. గతంలో K అంటే కల్కి అని అన్నారు. ఆ తర్వాత K అంటే 'కాలచక్ర' అని టాక్ వచ్చింది. టైం ట్రావెల్ స్టోరీ కావడంతో కాలచక్రనే సరైన టైటిల్ అని అనుకున్నారు.

యుద్ధం పేరుతోనే కొత్త టైటిల్: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న Project K మూవీకి సంబంధించిన అసలు టైటిల్ తాజాగా లీకైంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి 'ప్రాజెక్టు - కురుక్షేత్ర' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారట. ఇప్పటికే నిర్మాతలు ఈ పేరును ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేశారని తెలిసింది. ఇందులో కురుక్షేత్ర యుద్ధాన్ని హైలైట్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











