Project K: ప్రభాస్ సినిమా అసలు టైటిల్ లీక్.. K అంటే మీనింగ్ అదేనా.. మబ్బులిడిపోయే ట్విస్ట్ సామీ!

టాలీవుడ్‌లోకి హీరోగా పరిచయం అయినప్పటి నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి' తర్వాత ఎన్నో భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అతడు.. ఇటీవలే 'ఆదిపురుష్' అనే మూవీతో వచ్చాడు. ఇక, ఇప్పుడు చేతిలో నాలుదైదు సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో 'Project K' ఒకటి. పాన్ వరల్ట్ రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన అసలు టైటిల్ తాజాగా లీకైంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ప్రాజెక్టు K అంటూ తీస్తున్నారు:యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమే 'Project K'. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Project K Movie

షూటింగ్ ఇలా.. సగం అయింది: 'Project K' సినిమాను పాన్ వరల్డ్‌ రేంజ్‌తో తీస్తున్నట్లు మొదట్లోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుం ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగానే టాకీ పార్టును పూర్తి చేశారు.

Project K Movie

భారీ బడ్జెట్... స్టోరీ లైన్ ఏంటి?:'Project K' మూవీని దాదాపు రూ. 600 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు లీక్ అయ్యాయి. అందుకు తగ్గట్లుగానే హై రేంజ్ టెక్నికల్ వ్యాల్యూస్‌తో దీన్ని తీస్తున్నారు. అంతేకాదు, ఈ మూవీ టైం ట్రావెల్ స్టోరీతో నడుస్తుందని ముందే రివీలైంది. ఇక, ఇందులో టైం మెషీన్ యుగాలనే దాటి వెళ్లిపోతుందట. అంటే గతానికి, భవిష్యత్‌కు ముడి పెట్టబోతున్నారు.

Project K Movie

Project K టైటిల్ కాదట:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారన్న దానిపై ఎన్నో రకాల ఊహాగానాలు వైరల్ అయ్యాయి. అయితే, దీనికి చిత్ర యూనిట్ Project K అనే పేరును పెట్టింది. దీంతో ఇదే ఫైనల్ అని అంతా అనుకున్నారు. కానీ, ఈ పేరు కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది.

అదే కంటిన్యూ.. మారుస్తారు:వాస్తవానికి ఈ సినిమాకు Project K కాకుండా మరో టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ప్రేక్షకుల నోళ్లల్లో ఈ పేరు బాగా నానింది. దీంతో ఇదే కంటిన్యూ చేయాలని కూడా అనుకున్నారు. అయితే, ప్రాజెక్టు పక్కన ఉన్న 'K' అక్షరానికి మాత్రం కాస్త వివరణాత్మక టైటిల్ పెడతారని తెలిసింది. గతంలో K అంటే కల్కి అని అన్నారు. అంటే ప్రాజెక్ట్ కల్కి అనే పేరు పెట్టే ఛాన్స్ ఉందని టాక్ వచ్చింది.

Project K Movie

అసలు పేరు తెలిసిందిగా:ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న Project K మూవీకి సంబంధించిన అసలు టైటిల్ తాజాగా లీకైంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి 'ప్రాజెక్టు - కాలచక్ర' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారట. ఇప్పటికే నిర్మాతలు ఈ పేరును ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేశారని తెలిసింది. టైం ట్రావెల్ కథతో నడిచే సినిమా కావడంతో ఈ టైటిల్ ఫిక్స్ చేశారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X