వైవియస్ చౌదరి చిత్రానికి పీఆర్పీ ఎమ్మల్యే ఫండ్స్!?
ప్రముఖ దర్శకుడు, నిర్మాత వైవియస్ చౌదరి రూపొందిస్తున్న రేయ్ చిత్రం ఆర్దిక ఇబ్బందుల్లో ఇరుక్కుందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే వైవియస్ చౌదరి మంచితనం, నిక్కిచ్చితనం తెలిసిన ఓ పీఆర్పీ ఎమ్మల్యే ఒకరు బ్యాకింగ్ ఇచ్చి చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. నిప్పుతో చేతులు కాల్చుకున్న వైవియస్ చౌదరికి చిరు వర్గం సపోర్ట్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. చిరంజీవి మేనల్లుడు ధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.. కథ ప్రకారం ఫస్టాఫ్ వెస్ట్ ఇండీస్ లోనూ, సెకండాఫ్ అమెరికాలోనూ జరుగుతుంది. అందుకే ఆయా ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు. మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా లవ్ స్టోరీగా రూపొందుతోందని దర్శకుడు చౌదరి చెబుతున్నారు.
'షౌట్ ఫర్ సక్సెస్' అన్నది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు. శుభ్ర అయ్యప్ప కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు చౌదరి చెప్పారు. తమ 'బొమ్మరిల్లు వారి' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రేయ్ చిత్రంలో శ్రద్దాదాస్.. అమెరికన్ పాప్ సింగర్ గా అలరించనుంది. ఇందుకోసం ఆమె కాస్ట్యామ్స్ దగ్గరనుంచి అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని,స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతూ, కిక్ బాక్సింగ్,యోగా ప్రాక్టీస్ చేస్తోంది. అలాగే వైవియస్ చౌదరి కూడా ఓ రేంజిలో శ్రద్దాదాస్ అందాలను తెరకెక్కించి, కిక్ ఇవ్వటానికి రెడీ అయ్యిపోయాడని తెలుస్తోంది. ఆమె ఈ చిత్రంలో శృంగార దేవతలా అనిపిస్తుంది అంటున్నారు.


Click it and Unblock the Notifications











