PSPK27 టీజర్ లీక్స్: పవన్ చేస్తున్న క్యారెక్టర్ ఇదే.. అందరి చూపు కీరవాణి వైపే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అంతకంటే ఎక్కువగా 27వ వినిమాపైనే ఉన్నాయి. ఆ సినిమాకు సంబంధించిన గాసిప్స్ సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక దర్శకుడు క్రిష్ శివరాత్రి కానుకగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. టైటిల్ తో పాటు పవన్ లుక్ ను కూడా చూపించబోతున్నారు. అయితే ఆ ఫస్ట్ టీజర్ కు సంబంధించిన కొన్ని విషయాలు లీక్ అయ్యాయి.

హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్

హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్

పవన్ కళ్యాణ్ మొదటిసారి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్ పై పెరుగుతున్న బజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల కొన్ని లొకేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అయ్యాయి. సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పాటు చారిత్రక అంశాలు ఎన్నో ఉంటాయట.

టీజర్ రెడీ..

టీజర్ రెడీ..

సినిమా మొత్తం 17 శతాబ్దంలో జరిగే కథ అని తెలుస్తోంది. 300 ఏళ్ళ క్రితం నాటి భాగ్యనగరాన్ని అలాగే గండికోట వంటి చారిత్రాత్మక కట్టడాలను కూడా చూపించబోతున్నారు. ఇక మహా శివరాత్రి సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను టీజర్ ను ఇప్పటికే రెడీ చేశారని తెలుస్తోంది.

సంక్రాంతికి రానున్న సినిమా

సంక్రాంతికి రానున్న సినిమా

గత ఏడాది కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోగా దర్శకుడు క్రిష్ సరికొత్త ప్లానింగ్ తో షెడ్యూల్స్ ని మళ్ళీ రెడీ చేసుకున్నాడు. సినిమాను 2022 సంక్రాంతికి చేయాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఇక సినిమా టైటిల్ పై చాలా కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక ఫైనల్ గా రేపటితో ఆ రూమర్స్ కు బ్రేక్ పడనుంది.

పవన్ పాత్ర పేరు

పవన్ పాత్ర పేరు

ఇక మూవీకి మొట్టమొదట విరూపాక్ష అనే టైటిల్ ని సెట్ చేసుకున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు దాన్ని కేవలం వర్కింగ్ టైటిల్ గానే అనుకున్నాడు. రీసెంట్ గా హరిహర వీరమల్లు, హరహర మహాదేవ అనే టైటిల్స్ పై కూడా కథనాలు వచ్చాయి. అందులో హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని టాక్. ఇక సినిమాలో పవన్ చేస్తున్న పాత్ర పేరు వీరమల్లు అని తెలిసింది.

అందరిచూపు కీరవాణి వైపే..

అందరిచూపు కీరవాణి వైపే..

ఇక ఈ సినిమాకు ఎమ్ఎమ్.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో దాదాపు అందరి హీరోల సినిమాలకు పని చేసిన కీరవాణి ఇంతవరకు పవన్ సినిమాకి వర్క్ చేయలేదు. ఇక మొదటిసారి పవర్ స్టార్ తో చేస్తున్న సినిమా కాబట్టి మ్యూజిక్ పై కూడా అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక గురువారం రాబోయే ఫస్ట్ లుక్ టీజర్ కు కూడా ఆయన తనదైన శైలిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేసినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X