పవన్ - రానా సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్: ఊహించని విధంగా డివోషనల్ టచ్‌తో వస్తున్నారుగా!

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పటి ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు రావడంతో ఇలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు. దీంతో వీటిలో చాలా వరకూ సూపర్ హిట్లు అయ్యాయి. అందుకే దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా మల్టీస్టారర్ మూవీలు చేయడానికి రెడీ అంటున్నారు. ఇలా ఇప్పుడు తెరకెక్కుతోన్న వాటిల్లో పవన్ - రానా మూవీ కూడా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు చిత్ర యూనిట్ అదిరిపోయే టైటిల్‌ను రిజిస్టర్ చేయించిందట. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

 ఆ రీమేక్ మూవీలో పవన్.. రానా

ఆ రీమేక్ మూవీలో పవన్.. రానా

మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అయిన చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'. ఈ సినిమా రీమేక్‌లోనే పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

సినిమా కథ... ఇద్దరి పాత్రలు ఇలా

సినిమా కథ... ఇద్దరి పాత్రలు ఇలా

చిన్న ఊరిలో ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో తెరకెక్కిన చిత్రమే 'అయ్యప్పనుమ్ కోషియం'. బీజూ మీనన్ ఎస్సైగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ లోకల్ డాన్‌గా నటించారు. ఇప్పుడిదే కథను తెలుగు నేటివిటీని అనుగుణంగా మార్చి తెరకెక్కిస్తున్నారు. ఇందులో బీజూ పాత్రలో పవన్ కల్యాణ్.. పృథ్వీ చేసిన రోల్‌లో దగ్గుబాటి రానా నటిస్తున్నారు.

 కొంత కంప్లీట్... మిగతాది అప్పుడే

కొంత కంప్లీట్... మిగతాది అప్పుడే

'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌కు సంబంధించిన షూటింగ్ మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తైంది. ఆ తర్వాత కూడా చాలా వరకు చిత్రీకరణ జరిగింది. అంతలో కరోనా రెండో దశ రావడంతో దాన్ని నిలిపేశారు. అయితే, ఇప్పుడు షూటింగ్‌లు మొదలవుతోన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కూడా జూలై 11 నుంచి పున: ప్రారంభించి.. ఆగస్టు చివరి కల్లా చిత్రీకరణను పూర్తి చేస్తారని తెలిసింది.

సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్

సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌ మూవీకి 'బిల్లా రంగ' అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ, దానికి సంబంధించిన ఎటువంటి అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కోసం ఓ అదిరిపోయే పవర్‌ఫుల్ టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఊహించని విధంగా డివోషనల్ టచ్‌

ఊహించని విధంగా డివోషనల్ టచ్‌

తాజా సమాచారం ప్రకారం.. ఈ భారీ మల్టీస్టారర్ మూవీకి డివోషనల్ టచ్ ఇస్తూ 'పరశురామ కృష్ణమూర్తి' అనే టైటిల్‌ను పెడుతున్నట్లు తెలిసింది. ఇందులో పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా క్యారెక్టర్ పేర్లు ఉండేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే, ఈ రెండు పేర్లలో ఎవరి క్యారెక్టర్ ఏంటి? అనేది మాత్రం తెలియలేదు. మొత్తానికి ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ టైటిల్‌ ఆకట్టుకుంటోంది.

 PSPK Rana Movie: Parashurama Krishnamurthi Fix for Ayyappanum Koshiyum Remake

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X