పవన్ ఫ్యాన్స్ కి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. మారనున్న సినిమాల లైనప్!
వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఆయన చేస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇక బండ్ల గణేష్ కాంబినేషన్లో కూడా ఆయన ఒక సినిమా అనౌన్స్ చేశాడు.. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ సినిమాల లైనప్ మారిందని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే.

వకీల్ సాబ్ రీ ఎంట్రీ
అజ్ఞాతవాసి సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న పవన్ ఇక సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని రాజకీయాల్లోకి వెళ్ళి పోయారు. అనూహ్యంగా మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా త్వరగా థియేటర్ల నుంచి వెళ్లిపోయిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా పెద్దగా రికార్డులు బద్దలు కొట్ట లేకపోయింది కానీ సినిమా పరంగా మాత్రం అందరి ప్రశంసలు అందుకుంది.

హరిహర వీరమల్లు
ఈ సినిమా తర్వాత ఆయన దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. తెలంగాణకు చెందిన ఒక బందిపోటు జీవిత కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు అనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి గతంలో ఒక టీజర్ లాంటిది కూడా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ లభించింది.

మలయాళం రీమేక్
ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోషియం అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

మరో రెండు సినిమాలు
ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాను ప్రస్తుతానికి pspk28 అని సంభోదిస్తున్నారు.. అయితే ముందు నుంచి అనుకుంటున్న లెక్క ప్రకారం పవన్ చేస్తున్న రెండు సినిమాల రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించారు..

అయితేనేం
అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కంటే ముందే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. హరిహర వీర మల్లు సినిమా నిర్మాత కారణంగా ఈ ఆలస్యం జరుగుతోందని ఫిలింనగర్ వర్గాల టాక్.. అయితే మొత్తం మీద కొంచెం వెనక ముందు అయినా సరే ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతాయనే నమ్మకంతోనే ఉన్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











