PSPK28 update: పవన్ కల్యాణ్ తొలిసారి అలాంటి సాహసం.. కెరీర్‌లోని మొట్టమొదటి సారి అలా..
టాలీవుడ్‌కు మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వరుస చిత్రాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులను ఆలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ చిత్రం రికార్డు వసూళ్లను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో PSPK28 మూవీ గురించి ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగించే అప్‌డేట్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఆ అప్ డేట్ వివరాల్లోకి వెళితే...
Recommended Video

క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్
పవన్ కల్యాణ్ నటించబోయే PSPK28 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో హరీష్ శంకర్ దర్వకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మళ్లీ పోలీస్ అధికారిగా పవన్
PSPK28 కథ విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్ మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే గబ్బర్ సింగ్‌తోపాటు పలు సినిమాల్లో పవర్‌స్టార్ పోలీస్ అధికారిగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథాపరంగా అత్యంత బలమైన పాత్రలో పవన్ కనిపించబోతున్నట్టు సమాచారం.

తొలిసారి ద్విపాత్రాభినయం
PSPK28 సినిమాకు సంబంధించిన పవన్ కల్యాణ్ తన కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తండ్రి, కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. పవన్ డ్యూయల్ రోల్‌లో కనిపిచండం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పవర్‌ఫుల్ కథతో వస్తున్న పవన్ కల్యాణ్ ఇలాంటి సాహసం చేయడం తొలిసారి.

ఆ రెండు చిత్రాల తర్వాత
PSPK28 చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు కరోనావైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. దాంతో ఈ సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పవన్ కరోనా నుంచి తేరుకొన్న తర్వాత అయ్యప్పనుమ్ కోషియం, అలాగే క్రిష్ సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











