BRO: పబ్‌లో మెగా హీరో రచ్చ.. ఐదు నిమిషాలకే అంత ఖర్చా!

మెగా ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో 'బ్రో (BRO)' అనే మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు, దర్శకుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'వినోదయ సీతమ్' మూవీకి ఇది రీమేక్‌గా రూపొందుతోంది. గతంలో ఆ చిత్రం నేరుగా ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. అక్కడ అదిరిపోయే స్పందన రావడంతో ఇప్పుడు దీన్ని తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న 'బ్రో (BRO)' మూవీ షూటింగ్‌ను ఫిబ్రవరి నెలఖరున మొదలు పెట్టారు. అంతేకాదు, ఆ వెంటనే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పార్టును కూడా కంప్లీట్ చేసేశారు. ఇలా ఇప్పటికే ఈ మూవీ షూట్ దాదాపుగా పూర్తవడానికి వచ్చింది. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఈ చిత్రాన్ని జూలై 28న విడుదల చేయడానికి ప్లాన్లు చేసుకుంటోన్నారు. ఇక, రెండు రోజుల క్రితమే ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో రికార్డు బ్రేక్ అయ్యాయి.

Pub Set Erected for Pawan Kalyan and Sai Dharam Tej BRO Movie

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'బ్రో (BRO)' మూవీకి సంబంధించి కొంత భాగం చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండిపోయింది. దీనికోసం ఇప్పుడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ పబ్ సెట్‌ను నిర్మిస్తున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఇందులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారట. ఇక, ఈ సెట్ కోసం కోటి రూపాయలకు పైగానే ఖర్చు చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక, దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను వచ్చే వారమే ప్రారంభించబోతున్నారని తెలిసింది.

Pub Set Erected for Pawan Kalyan and Sai Dharam Tej BRO Movie

పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రాబోతున్న ఈ చిత్రంలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X