పవన్ కళ్యాణ్ ‘పంజా’ టైటిల్ పై పబ్లిక్ టాక్...!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమి దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి పంజా అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ చిత్రం షూటింగ్ మొదలయినప్పటి నుండి షాడో, తిలక్, పవర్, కాళీ తదితర పేర్లు తెరపైకి రాగా చివరికి నిర్మాతలు 'పంజా" టైటిల్ ని ఖరారు చేసారు. ఇది పవన్ కళ్యాణ్ సెలెక్షన్ చేసిన టైటిలే అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ను చాలా మంది ఇష్టపడుతారు. మిగతావాళ్లు ఏం అనుకుంటారని అస్సలు ఆలోచించడు..టక్కున చేసేస్తాడు.
'పంజా" టైటిల్ విషయమే తీసుకోండి 'పంజా అనగానే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతి పెద్ద ప్లాప్ గా మిగిలిపోయిన 'కొమరం పులి" సినిమా గుర్తుకు వస్తుందనేది పట్టించుకోకుండా..పంజా విసరడానికి ఆయన సిద్దమైపోతున్నాడు. 'పులి" సౌండింగ్ మెగా ఫ్యామిలీకి ఎప్పుడూ అచ్చిరాలేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'పులి", మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన చిరుత'(పులి) పవర్ స్టార్ నటించిన కొమరం 'పులి"ఘోరంగా ప్లాప్ కావడం తెలిసిందే.
ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకోకుండా తమిళ డైరెక్టర్ విష్ణువర్థన్ దర్శకత్వంలో రూపొందుతన్న తన తాజా చిత్రానికి పంజా అనే టైటిల్ ను ఏరికోరి ఎంపిక చేసుకున్న గట్స్ కు హ్యాట్స్ ఫ్ చెబుతున్నారంతా.. అలాగే ఈ చిత్రానికి సంభందించిన స్టిల్స్ ని కూడా విడుదల చేసారు. అయితే ఈ స్టిల్స్ నుండి మిశ్రమ స్పందన లభిస్తుంది. గుబురు గెడ్డంతో ఉన్న పవన్ చాలా స్టైలిష్ గా ఉన్నాడని కొందరంటుంటే పవన్ కి ఈ గెటప్ అంతగా సూటవ్వలేదని ఈ గెటప్ లో పవన్, పాత సినిమాల్లో నాగబాబు లా ఉన్నాడని, మరికొందరు అంటుంటే, ఇంకొందరేమో మిళ హీరో విక్రమ్ లా ఉన్నాడని అంటున్నారు.
కాగా తన సినిమాలను చాలా స్టైలిష్ గా తెరకెక్కించే విష్ణువర్థన్ మరి పంజా సినిమాలో ఎలా చూపించాడో అని మెగా అభిమానులు చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ లో విడుదలకాబోతున్న ఈ సినిమాని తెలుగులోనే కాక తమిళంలో కూడా డబ్ చేసి విడుదల చెయ్యబోతున్నారు. ఈ చిత్రం ఆడియో త్వరలోనే మార్కెట్ లోకి రాబోతుంది.


Click it and Unblock the Notifications











