పవన్ కళ్యాణ్‌తో తెలుగమ్మాయి.. అంతా ఫినిష్! ఇక అమ్మడి దశ తిరిగినట్లే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో తెలుగమ్మాయి పూజిత పొన్నాడ అవకాశం పట్టేసిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో ఈమెకు ఐటమ్ సాంగ్ చేసే అద్భుత అవకాశం దక్కిందని అంటున్నారు. వివరాల్లోకి పోతే..

Recommended Video

Ram Charan Inspired From Pawan Kalyan, Donates 70Lakhs To AP & TS CM Releif Fund
పవన్- క్రిష్ మూవీ.. మెగా అభిమానుల్లో ఆతృత

పవన్- క్రిష్ మూవీ.. మెగా అభిమానుల్లో ఆతృత

ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల జోరు పెంచేశారు. ఇప్పటికే 'పింక్' రీమేక్ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన.. ఇటీవలే క్రిష్ దర్శకత్వంలోనూ మరో సినిమా స్టార్ట్ చేసేశారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో ఆతృతను పెంచేస్తున్నాయి.

బందిపోటుగా పవన్..

బందిపోటుగా పవన్..

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈసినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని సమాచారం. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నారని తెలుస్తోంది. రాబిన్ హుడ్ తరహాలో ఈ పాత్ర సాగుతుందని అంటున్నారు.

హీరోయిన్‌పై ప్రత్యేక శ్రద్ద.. చివరకు

హీరోయిన్‌పై ప్రత్యేక శ్రద్ద.. చివరకు

ఇక ఈ సినిమాలో పవన్ సరసన నటించనున్న హీరోయిన్ కోసం కొంతకాలంగా వేట కొనసాగుతూనే ఉంది. పవన్ హీరోయిన్ విషయమై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న క్రిష్.. ముందుగా 'కంచె' సినిమా హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ని పరిశీలించారు. ఆ తర్వాత కియారా అద్వాని పేరు తెరపైకి వచ్చింది. కానీ చివరగా కీర్తి సురేష్ వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది.

ఐటమ్ సాంగ్.. పవన్‌తో పూజిత

ఐటమ్ సాంగ్.. పవన్‌తో పూజిత

ఇదిలాఉంటే ఈ మూవీలో ఓ ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ కూడా ఉందట. అందుకోసం తెలుగమ్మాయి పూజిత పొన్నాడను తీసుకున్నారని టాక్. అంతేకాదు ఓ భారీ సెట్ వేసి పూజిత పొన్నాడ- పవన్‌లతో ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే అమ్మడి దశ తిరిగినట్లే మరి!.

పరిశీలనలో విరూపాక్ష..

పరిశీలనలో విరూపాక్ష..

భారీ బడ్జెట్ కేటాయించి ఫేమస్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్. చిత్రానికి కీరవాణి బాణీలు కడుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారట డైరెక్టర్ క్రిష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X