ప్చ్...రూల్ కి కరెక్టుగా 'పులి' నిర్మాతే దొరికారు...
'ఎ' సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే పిల్లలను రూల్ ప్రకారం లోపలకి రానివ్వకూడదు. కానీ అది ఎప్పుడో గానీ జరగదు. అయితే తాజాగా పులి నిర్మాతల్లో ఒకరైన సి.కళ్యాణ్ ని ఆ రూల్ ప్రకారం ఆపారు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కొమరం పులి ప్రివ్యూ ను గురువారం రాత్రి ఇనాక్స్ ధియేటర్ లో ప్రివ్యూ వేసారు. ఈ షోకు సి.కళ్యాణ్ ఫ్యామిలి తో సహా హాజరయ్యారు. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చింది. సెన్సారు వారు 'ఎ' సర్టిఫికేట్ జారీ చేసారు. రూల్ ప్రకారం చిన్న పిల్లలు ఈ సినిమా చూడకూడదు. కాని సి.కళ్యాణ్ ఫ్యామిలి లో చిన్నపిల్లలు ఉండటంతో ఐన్యాక్స్ ధియేటర్ వాళ్ళు అభ్యంతరం పెట్టారు. కళ్యాణ్ వారిని లోపలకి తీసుకెళ్ళటానికి చాలా సేపు కన్వీన్స్ చెయ్యాల్సి వచ్చింది. ఒకానొక పరిస్ధితుల్లో ఆ పిల్లలను వెనక్కి పంపించేద్దామా అని నిర్ణయం కూడా చేసుకున్నారు. ఈలోగా ధియోటర్ యాజమాన్యంని కాంటాక్టు చేయటంతో వారు కలగచేసుకోవటంతో సమస్య పరిష్కారమయింది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











