Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్య సినిమాలో పవర్ స్టార్: పోలీస్ ఆఫీసర్‌గా అలరించనున్న స్టార్ హీరో
'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్ల తర్వాత సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. తద్వారా దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం... బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడట. పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి హీరోను ఓ ప్రమాదం నుంచి కాపాడుతాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల్లో జరగనుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, గతంలో బాలయ్య నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలో పునీత్ సోదరుడు శివ రాజ్‌కుమార్ గెస్ట్ రోల్ చేశారు. అలాగే, పునీత్ నటించిన ఓ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ ఓ పాటను పాడిన విషయం తెలిసిందే.
మరోవైపు, పునీత్ రాజ్‌కుమార్ 'యువరత్న' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. 'KGF' సినిమాను నిర్మించిన హోంబళే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాను సంతోష్ అనంద్రామ్ తెరకెక్కించాడు. సాయేషా సైగల్ హీరోయిన్గా చేస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు హీరో పునీత్ ట్విట్టర్ ద్వారా పోస్టర్‌ను విడుదల చేశాడు. తెలుగులో విడుదల కాబోతున్న మొదటి చిత్రం కావడంతో అందరి మద్దతు కావాలని ఈ ట్వీట్లో కోరాడతను.