డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ కి ఎన్టీఆర్ డేట్స్
జూ.ఎన్టీఆర్ తనతో గతంలో ఆంధ్రావాలా తో డిజాస్టర్ చిత్రం ఇచ్చిన పూరీతో ఓ చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫిల్మ్ నగర్ లో వినపడుతున్న మాటలను బట్టి పూరీ రీసెంట్ గా ఓ పార్టీలో కలిసన ఎన్టీఆర్ కి స్టోరీ లైన్ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా బుడ్డా చిత్ర్రం చూసానని మెచ్చుకుని, డేట్స్ కేటాయించటానికి సై అన్నట్లు చెప్తున్నారు. ఇక మహేష్ తో చేయనున్న ది బిజినెస్ మ్యాన్ చిత్రం అనంతరం ఈ సినిమాను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్..సురేంద్ర రెడ్డితో ఊసరవిల్లి చిత్రన్ని బోయపాటి శ్రీను తో చురకత్తి చిత్రాన్ని చేస్తూ బిజీగా ఉన్నారు. శక్తి ప్లాప్ అనంతరం ఎన్టీఆర్ కథలో విషయంలో చాలా జాగ్ర్తత్తలు తీసుకుని ఓకే చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక పూరీ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం పూర్తి స్దాయి మాస్ ఎంటర్టైనర్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











