నాగబాబు కొడుకు నెక్ట్స్ బుక్కయిపోయాడు
హైదరాబాద్ : మెగా బ్రదర్ నాగ బాబు కుమారుడు వరుణ్ తేజ తన తాజా చిత్రం ముకుంద టీజర్ వదలగానే ఆఫర్స్ వరదలా వచ్చిపడుతున్నట్లు సమాచారం. అతని తదుపరి చిత్రానికి దర్శకుడు గా పూరి జగన్నాథ్ ఆల్రెడీ ఎంపిక చేసారని తెలుస్తోంది. పూరి సైతం ...ఈ కుర్రాడితో ఓ లవ్ స్టోరీ తీసి హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పుకుంటున్నారు. సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాసం ఉందని, ఇప్పటికే ఓ స్టోరీ లైన్ ని వినిపించారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ నేనో రకం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
వరుణ్ తేజ 'ముకుంద' విషయానికి వస్తే...

వరుణ్‌తేజ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ముకుంద'. పూజాహెగ్డే హీరోయిన్. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'ముకుంద' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ వీడియో చూసిన వారంతా ఓ రేంజిలో హీరో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం దసరాకి విడుదల చేయాలని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరో ప్రక్కన చేసేస్తున్నారు. అయితే రామ్ చరణ్ తాజా చిత్రం గోవిందుడు అందరి వాడేలా చిత్రం ని దసరాకు టార్గెట్ చేయటంతో ... నాగబాబు కొడుకు సినిమాని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెలఖరుకు చిత్రం టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం.
సమర్పకుడు ఠాగూర్ మధు మాట్లాడుతూ ‘‘ఇటీవల గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో 35రోజులు భారీ షెడ్యూల్ చేశాం. ప్రస్తుతం అమలాపురంలో షూటింగ్ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే చిత్రీకరణతో మూడు పాటలు మినహా మొత్తం పూర్తవుతుంది. '' అని అన్నారు.
లియో ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. మిక్కీ.జె.మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రావు రమేష్, నాజర్ ఇందులో కీలక పాత్రధారులు.


Click it and Unblock the Notifications











