బాలయ్య చిత్రానికి పూరీ జగన్నాధ్ రెమ్యునేషన్ ఎంత?
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చిత్రం ఎనౌన్స్ అయినప్పటినుంచీ పూరీ రెమ్యునేషన్ పై ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్..ఏడు కోట్లు రెమ్యునేషన్ ఆఫర్ చేసారని వినపడుతోంది. అది కూడా ఒన్ టైమ్ పేమెంట్ అనీ అందుకే పూరీ వేరే ఏమీ ఆలోచించకుండా ఈ ప్రపోజల్ కి ఓకే అన్నారని చెప్తున్నారు. అలాగే మొదట తన కథలు బాలయ్య ఇమేజ్ కి వర్కవుట్ కావని చెప్పారని తెలుస్తోంది. అయితే బాలకృష్ణ కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపటంతో పూరీ కథా వంటకం ప్రారంభించాడని చెప్తున్నారు. ప్రస్తుతం గోలీమార్ ఫైనల్ టచెస్ లో ఉన్న పూరీ రాత్రింబవళ్ళు బాలయ్య స్క్రిప్టుపైనే దృష్టి పెట్టారని చెప్తున్నారు. ఇక నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం గురించి...బాలయ్యబాబు కెరీర్ లోనే ఓ సెన్సేషనల్ మూవీగా నిలిచేవిధంగా హై రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం. పూరి జగన్నాథ్, బాలయ్య బాబు కాంబినేషన్ అంటే చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వాటికి ధీటుగా ఈ చిత్రం సబ్జెక్ట్ ఉంటుంది అంటున్నారు.


Click it and Unblock the Notifications











