'హార్ట్‌ఎటాక్' ఇన్ సైడ్ టాక్ ఏంటి?
హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన చిత్రం 'హార్ట్‌ఎటాక్' . రేపు( 31న) విడుదల ఈ చిత్రం ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఇంటర్వెల్ బ్లాక్,ఫస్ట్ హాఫ్ హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. అలాగే సెకండాఫ్ క్లైమాక్స్ ముందు ఓ పదిహేను నిముషాలు చాలా ఎమోషనల్ గా హార్ట్ ని టచ్ చేసేలా సాగుతుందని తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం పూరికి మరో పెద్ద బ్రేక్ ఇచ్చే చిత్రం అంటున్నారు.
ఇక ఈ చిత్రం హీరో క్యారక్టరైజేషన్ తో నడుస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నితిన్‌ని ఓ పోకిరి ప్రేమికుడిగా చూపించబోతున్నారు. తొలిసారిగా నితిన్ ...పూరి దర్శకత్వంలో నటించటంపై మంచి అంచానాలే ఉన్నాయి. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ... ''మాస్, క్లాస్ అంశాలు మేళవించిన ప్రేమ కథ ఇది. నితిన్ గెటప్, ఆయన పాత్ర చిత్రణ ఆకట్టుకొంటాయి. స్పెయిన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు యువతరాన్ని అలరిస్తాయనే నమ్మకం ఉంది'' అని చెప్తున్నారు.

ప్రేమ కథలు తెరకెక్కించడంలో పూరి జగన్నాథ్‌ది ప్రత్యేక శైలి. అందులోనే వినోదం, పోరాట దృశ్యాలు ఉండేలా జాగ్రత్త పడతారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'హార్ట్‌ఎటాక్'. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంస్థ తెరకెక్కిస్తోంది. నితిన్ సరసన ఆదా శర్మ హీరోయిన్ . అలాగే ఈ చిత్రంలో నితిన్ పికలతో కనిపించనున్నారు. సాధారణంగా పూరి సినిమాలోని హీరోలకు అమ్మాయిలను ఆటపట్టించే బిహేవియర్ ఉంటుంది. రోమియోలుగా, జులాయిగా కనిస్తారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ చూస్తుంటే కూడా అలానే అనిపిస్తోంది. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది.
నితిన్ ఈసినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానని అంటున్నాడు నితిన్.అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన హారర్ సినిమా '1920' ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన ఆదాశర్మ ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి అమోల్ రాథోడ్ ఫోటోగ్రఫీని అందిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. పాటలు: భాస్కరభట్ల, కెమెరా: ఆమోల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











