నేనింతే'ఎఫెక్టు..సాయి రామ్ శంకర్ కి?

అయితే ఇప్పుడు పూరీ..ప్రభాస్ తో సినిమాకు కథ వండుతున్నాడని సమాచారం. అలాగే మహేష్ బాబు,పవన్ కళ్యాణ్ లతో చేయబోయే ప్రాజెక్టులు కూడా లేటవనుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు మరో కథనం. ప్రస్తుతం ఉన్న స్ధితిలో బుజ్జిగాడు,నేనింతే వరస పరాజయాలకు సరైన సమాధానం చెప్పాలని ఆయన యోచిస్తున్నారని చెప్తున్నారు. అందుకోసమే తమ్ముడుతో సినిమా కన్నా ప్రభాస్ తో సేఫ్ అని నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. అసలు మొదట సాయి రామ్ హీరోగా చచ్చిపోతే చేస్తాడని అంతా ఊహించారు. ఆ తర్వాత అదేం లేదు మూడు కోతులు అనటంతో అంతా అటు ఫిక్స్ అయ్యారు.
అందులోనూ ముమైత్,బిందు మాధవిలకు ముఖ్య పాత్రలిస్తారని వార్తలు కూడా రావటంతో అంతా ఏదో మంచి ప్రాడెక్టు రాబోతోందని ఆశించారు. ఏదైనా ప్రభాస్ మాటెలా ఉన్నా సిక్స్ పాక్ బాడీ పెంచి తన అన్న సినిమా కోసం వెయిట్ చేస్తున్న సాయిరామ్ కి ఇది ఊహించని దెబ్బే. ఎందుకంటే నేనింతే వర్కవుట్ అయి ఉంటే ఆ క్రేజ్ తో బయిట ఆభర్స్ కూడా అతనికి వచ్చి ఉండేవి. అవన్నీ మిస్సయినట్లే.


Click it and Unblock the Notifications











