దానర్దం...ఎన్టీఆర్ హ్యాండిచాడనేగా

By Srikanya

హైదరాబాద్ : ఎన్టీఆర్ డేట్స్ ఇస్తారని చాలా ఆశలు పెట్టుకున్న పూరీ ఆశలు తీరేటట్లు కనపడటం లేదంటున్నారు. ఎన్టీఆర్ రీసెంట్ గా తాను డేట్స్ కేటాయించలేనని పూరీ తో చెప్పటంతో దగ్గుపాటి రానా వద్దకు వెళ్లాడని సమాచారం. పూరీ అప్పటికప్పుడు అల్లేసి చెప్పేసే కథలను నమ్మి చేసే ధైర్యం ఎన్టీఆర్ కు లేకపోవటమే ఈ మార్పుకి కారణం అంటున్నారు. దగ్గుపాటి రానాతో గతంలో నేనూ...నా రాక్షసి చిత్రం చేసారు. ఇప్పుడు మరోసారి రానాని డైరక్ట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పూరీ, దగ్గుపాటి రానా కాంబినేషన్ లో రూపొందే ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. తమ కుమారుడుని ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని సురేష్ బాబు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వరసగా ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు. అయితే సురేష్ బాబు తో మేకర్స్ కు ఓ సమస్య ఉంది. ఆయన స్క్రిప్టు విషయాలన్ని అన్ని తనకు తెలుసునని రకరకాలు సూచనలు చేస్తూ, తన ఇష్టం వచ్చినట్లు మార్చి,చివరకు తనకు నచ్చలేదని ప్రాజెక్టుని క్లోజ్ చేస్తూంటారు. కానీ పూరీ ఆ స్కూల్ కి పూర్తి వ్యతిరేకం. స్టోరీ డిస్కషన్స్ అంటే ఆసక్తి చూపరు.

Puri Jagan again directing Rana

మరో ప్రక్క బాహుబలి,రుద్రమదేవి చిత్రాలతో బిజీగా ఉన్న దగ్గుపాటి రానా త్వరలో 'చుట్టాలబ్బాయి'గా కనిపించి అలరించనున్నారు. ఈ టైటిల్ ని రానా,పరుసరామ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి ఖరారు చేసారు. ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించనుంది. 'యువత', 'ఆంజనేయులు', 'సోలో' చిత్రాలతో మాస్, కుటుంబ ప్రేక్షకులనూ మెప్పించిన పరుశరామ్ గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మధ్యన రామ్ తో చిత్రం ఓకే అయ్యి ఆగిపోయింది.

దాంతో రానా కోసం ఇప్పుడు మరో కథ సిద్ధం చేసుకుని సురేష్ బాబుకి వినిపించారు. అలాగే ఇప్పటికే రానా సైతం స్టోరీ లైన్‌ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో స్క్రిప్టు తయారు చేసే పనిలో ఉన్నారు పరశురామ్‌. ఈ చిత్రానికి 'చుట్టాలబ్బాయి' అనే పేరు నిర్ణయించినట్టు తెలుస్తోంది. యువత, కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే కథాంశమని భోగట్టా. ప్రస్తుతం హీరోయిన్ ఎంపికపై కసరత్తు జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X