అంటే మహేష్ తో లేనట్లా?

By Srikanya

హైదరాబాద్ : మహేష్ బాబు, పూరి జగన్నాథ్ వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. దాంతో ఈ కాంబినేషన్ మరోసారి రెడీ అవ్వబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ తో పూరీ చేస్తున్న చిత్రం పూర్తవగానే ఈ చిత్రం మొదలవుతుందని అన్నారు. అయితే ఇప్పుడు మంచు విష్ణుతో ఓ తమిళ చిత్రం రీమేక్, రానా తో ఓ చిత్రం నిమిత్తం పూరీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే...స్పీడుగా సినిమాల్ని తెరకెక్కించడంలో దిట్ట.. పూరి జగన్నాథ్‌. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమా గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు. ఆయన ఎన్టీఆర్‌ హీరో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈలోగా రానా కోసం మరో కథ సిద్ధం చేస్తున్నారు. రానా, పూరిల కలయికలో 'నేను నా రాక్షసి' వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ కలయిక పట్టాలెక్కబోతోందని సమాచారం.

Puri Jagan again to work with Rana

తెలుగు, హిందీ భాషల్లో పూరి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, అందులో రానా హీరోగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. రానాకి హిందీలో మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు పూరి 'బుడ్డా బన్‌ గయా తేరా బాప్‌' చిత్రంతో బాలీవుడ్‌లో విజయం సాధించారు. అందుకే ఈ కలయికకు రంగం సిద్ధమైందన్నమాట. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఈ ప్రాజెక్టు కనుక పట్టాలు ఎక్కితే ఇప్పట్లో మహేష్ తో చిత్రం లేనట్లే కదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X