మ్యూజిక్ డైరక్టర్ గా మారిన పూరి జగన్నాధ్
దర్శకత్వంతో పాటు కథ,స్క్రీన్ ప్లే,మాటలు రాసుకునే సత్తా ఉన్న పూరీ జగన్నాధ్ త్వరలో సంగీత దర్శకుడుగా అవతారకమెత్తబోతున్నాడని సమాచారం. పూరి తన సోదరుడు సాయిరామ్‌శంకర్‌తో రూపొందించబోయే చిత్రానికి ఆయన సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరినే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పూరీ అశోసియేట్ గోపి దర్శకత్వం వహిస్తారు.
స్టోరీ డిస్కషన్స్ ఇప్పటికే పూర్తయిన ఈ చిత్రానికి ఛార్మిని హీరోయిన్ గా అనుకుంటున్నారు.ఇక పూరి ప్రస్తుతం అమితాబ్ తో బుడ్డ చిత్రం రూపొందిస్తున్నారు.ఈ హిందీ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.అలాగే పూరీ సంగీత దర్శకుడు అవతారమెత్తుతున్నాడనగానే అందరూ రామ్ గోపాల్ వర్మ గాయకుడుగా, లిరికి రైటర్ గా అవతారమెత్తిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











