twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ జగన్నాథ్ భార్యకు ఎంపీ టిక్కెట్?

    By Srikanya
    |

    నర్సీపట్నం: రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం టైటిల్స్ లో తన సోదరుడు గణేశ్.. వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నట్టుగా ఉన్న ఫొటోను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టిన పూరీ జగన్నాథ్ తన భార్యను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తారనే వార్త ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.

    త్వరలో పూరీ జగన్నాధ్ భార్య లావణ్యకు ను ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి దింపుతున్నారని,ఆమెను అనకాపల్లి ఎంపీ టిక్కెట్ అభ్యర్దిగా ప్రకటించనున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా వినపడుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ దినపత్రికల్లో సైతం కథనాలు రావటంతో ఇప్పుడు అవి జోరందుకున్నాయి. ఆమె వైసీపీ పార్టీ ద్వారా ఎన్నికల బరిలోకి దూకనున్నారని చెప్తున్నారు.

    అనకాపల్లి లోక్‌సభా స్థానం పరిధిలో కాపు సామాజికవర్గ ఓటర్లు అధికం. దాంతో వైసీపీ తమ పార్టీ నేతల్లో ఆ వర్గం నుంచి అంత చరిష్మా ఉన్నవాళ్లు ఎవరూ లేకపోవడంతో కొత్త అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ భార్య లావణ్య కాపు వర్గానికి చెందినవారు కావడంతో ఆమెను రంగంలోకి దించితే బాగుంటుందని భావిస్తున్నారని చెప్తున్నారు. పూరీ జగన్నాధ్ కుటుంబానికి వైయస్ జగన్ కుటుంబానికి ఉన్న అనుభందంమే ఈ మేరకు నిర్ణయాలు తీసుకునేలా చేస్తోందంటున్నారు.

    పూరీ జగన్నాథ్‌ది కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లి గ్రామం. పూరీ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ టీడీపీలో కోటవురట్ల మండలశాఖ అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాతి కాలంలో ఆయన టీడీపీ నుంచి బయటకొచ్చి వైసీపీలో చేరారు. ఇక ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు కూడా వైఎస్ జగన్ ప్రత్యేకంగా పూరీ స్వగ్రామమైన బీకేపల్లి వెళ్లారు. తర్వాత పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్ విజయలక్ష్మి, ఆమె కుమార్తె షర్మిల కూడా బీకే పల్లిలోని పూరీజగన్నాథ్ స్వగృహంలో రాత్రి బస చేశారు. హైదరాబాద్‌లో జరిగిన పూరీజగన్నాథ్ కుమార్తె ఓణీల ఉత్సవానికి జగన్ హాజరయ్యారు.

    పూరీ సోదరుడు గణేశ్‌ కూడా కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరుగుతున్న షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. అందువల్ల ఎలాగైనా పూరీ జగన్నాథ్‌ను ఒప్పించి ఆయన భార్య లావణ్యను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించడానికి వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వినికిడి.

    English summary
    Director Puri Jagannath is expected to fight for the Anakapalle Lok Sabha seat on a YSRC ticket. His home-town Narsipatnam falls in that constituency and his brother Ganesh is already handling the affairs of Kadapa MP Jagan Mohan Reddy’s party in the region after quitting TDP. Apparently, his wife Lavanya or his brother might seek an assembly seat while he could move to Delhi. Interestingly, his latest film 'Cameraman Ganga Tho Rambabu' has a dhoti-clad chief minister (reminding one of the late YSR) who is shown in a good light and who supports an upright scribe (Pawan) to take on the might of the opposition parties and also inspires him to lead a march to stop wicked politician Prakash Raj from unseating him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X