అరే...పూరి జగన్నాథ్ ఇలా అయ్యాడేంటి...??

By Srikanya

హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ అంటే కథ, అంతకు మించి పదునైన,గిలిగింతలు పెట్టే సంభాషణలు ఆయన సొంతం. అయితే ఆయన ఆ క్రాఫ్ట్ ని మెల్లిగా వదిలేస్తున్నట్లున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీఆర్ తో చేస్తున్న చిత్రానికి కథ వక్కంతం వంశీది. మరో ప్రక్క ఆయన ఓ తమిళ రీమేక్ చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దాంతో ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సొంతంగా కథ రాసుకుని, తనదైన శైలిలో హీరో పాత్ర స్పెషలైజేషన్ తో చెలరేగే పోయే ఆయన కలం మూగపోయిందా అని అంటున్నారు. ఆయన రీమేక్ చేయనున్న చిత్రం వివరాల్లోకి వెళితే...

విక్రమ్‌ప్రభు హీరోగా తమిళంలో ఘనవిజయాన్ని సాధించిన చిత్రం అరిమ నంబి. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కుల్ని మంచు విష్ణు సొంతం చేసుకున్నారు. ఈ రీమేక్‌లో ఆయనే హీరో గా నటించనున్నట్లు, దీనికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.

Puri Jagan with Tamil Remake?

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు తెలిసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న తొలి తమిళ రీమేక్ చిత్రమిదే కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X