Double Ismart Update: లైగర్ దెబ్బ... 'పూరి'ది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా.. ?

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, రామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఇస్మార్ట్‌ శంకర్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ శద్ద రికార్డుల వర్షం కురిపించడమే కాకుండా.. రామ్‌ కెరీయర్ లో వన్ ఆఫ్‌ ది మైల్ స్టోన్‌ సినిమాగా నిలిచిపోయింది. కాగా ఈ క్రేజీ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్‌ వస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా టైటిల్‌ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ వివరాలు తెలిపారు. అయితే ఈ సినిమా నుంచి మరో సూపర్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

డబుల్ ఇస్మార్ట్ అప్డేట్: డైరెక్టర్ పూరి జగన్నాథ్... సినిమాలకు యూత్ లో ప్రత్యేక మైన క్రేజ్ ఉంటుంది. ఆయన ఏ సినిమా తీసిన కొద్ది రోజుల్లోనే పూర్తి చేసేస్తాడు. తక్కువ సమయంలో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేస్తాడు. రాజమౌళి లాగా సంవత్సరాలు సంవత్సరాలు తీసుకోడు... అందులోనూ ఈయన సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే అప్పుడెప్పుడో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తీసిన పూరి.. దానికి సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు. డబుల్ ఇస్మార్ట్ అంటూ... వస్తున్నాడు.

Puri Jagannadh and Ram Pothineni upcoming double smart movie release date, shooting details here

పూరికి గట్టిగానే లైగర్ దెబ్బ: అయితే ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సమ్మర్ లో విడుదల కానుందని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక వచ్చే నెల జూలైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. షూటింగ్ పార్ట్ అంతా ఈ ఏడాది చివరకు కంప్లీట్ చేసి.. వేసవిలో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే గత ఏడాది పూరి తీసిన లైగర్ సినిమా డిజాస్టర్ గా మారింది. అటు పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలి అనుకున్న విజయ్ దేవరకొండకు సైతం నిరాశను మిగిల్చింది. ఈ సినిమాతో పూర్తి నష్టాల్లోకి వెళ్లిపోయాడు పూరి.

Puri Jagannadh and Ram Pothineni upcoming double smart movie release date, shooting details here

ఆలోచించి అడుగులు: అయితే లైగర్ దెబ్బకు.. పూరి ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే... పూరి జగన్నాథ్ ఏ సినిమా తీసిన తక్కువ సమయంలో పూర్తి చేస్తాడు. కానీ డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ఏకంగా వన్ ఇయర్ వరకు తీసుకుంటున్నాడు. లైగర్ దెబ్బకు పూరి ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఇక పూరి జగన్నాథ్.. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ హిట్ అయితేనే తన నెక్ట్స్ ప్రాజెక్టులు నిలదొక్కుకుంటాయి.

Puri Jagannadh and Ram Pothineni upcoming double smart movie release date, shooting details here

ఆ సినిమాలతో పోటికీ: ఇదిలా ఉంటే... పూరిది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా అంటున్నారు. ఎందుకంటే.. సమ్మర్ కు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఓ వైపు సుకుమార్, బన్నీల పుష్ప, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, ఎన్టీఆర్ దేవర, మహేశ్ గుంటూరు కారం వంటి సినిమాలు సమ్మర్ కు రిలీజ్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వీరితో పూరి పోటీకి దిగాల్సి ఉంటుంది. దానితో పాటు.. ఇటీవల ప్రాజెక్టు కే కూడా సమ్మర్ రిలీజ్ లిస్టులో చేరిందంటూ వార్తలు వచ్చాయి.

Puri Jagannadh and Ram Pothineni upcoming double smart movie release date, shooting details here

పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యేనా: అయితే పూరి సమ్మర్ పోటీకి దిగితే కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమా త్వరగా పూర్తి చేసి... ముందే రిలీజ్ చేస్తారా.. లేదా వారితో పోటీగి దిగుతారా తెలియాలంటే కాస్త ఆగాల్సిందే. ఇక ఈ సినిమా ఫస్ట్‌ పార్టును మించి ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఉండబోతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా అయినా పూరిని పాన్ ఇండియా డైరెక్టర్ ను చేస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X