Don't Miss!
- News
స్వల్ప భూకంపం.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో.. జనం పరుగులు
- Finance
Success Story: చిన్న వయస్సులోనే వ్యాపారంలోకి.. ప్రపంచంతో పోటీపడుతూ.. నూతన సాంకేతికతతో..
- Sports
భారత క్రీడల్లో స్వర్ణ యుగం మొదలైంది: నరేంద్ర మోదీ
- Automobiles
మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450
- Technology
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
- Lifestyle
ముద్దొచ్చే బుజ్జాయిలను ముద్దాడనివ్వొద్దు
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
పూరి జగన్నాథ్ పై విజయ్ దేవరకొండ హై లెవెల్ కాన్ఫిడెన్స్.. మరో సర్ప్రైజ్?
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా లైగర్ సినిమాపై ప్రస్తుతం పెరుగుతున్న అంచనాలు అయితే మామూలుగా లేవు. మొదటిసారి విజయ్ పవర్ఫుల్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో తప్పకుండా హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుంది అని ఇప్పటికే ఒక నమ్మకం ఏర్పడింది. విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే అందుకుంది. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
లైగర్ సినిమాను ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో వివిధ భాషల్లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే మరొక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. జనగణమన అనే ఆ ప్రాజెక్ట్ కూడా ఆసక్తికరంగా ఉండబోతుంది అని ఫస్ట్ లుక్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే అది పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్. ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. ఇలా పెద్ద హీరోలతో చేయాలనుకున్న ప్రాజెక్టును విజయ్ కోసం సెట్ చేశాడు అంటే తప్పకుండా కంటెంట్ చాలా బలంగా ఉండే ఉంటుంది అని చెప్పవచ్చు.

అయితే జనగణమన తర్వాత కూడా మరోసారి వీరిద్దరూ సినిమా చేయడానికి ఆలోచిస్తున్నట్లుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తోంది. లైగర్ సినిమా ద్వారా పూరికి చాలా క్లోజ్ అయిన విజయ్ దేవరకొండ అతనిపై పై చాలా నమ్మకం పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా విడుదలకు ముందే జనగణమున ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ సినిమా తర్వాత కూడా మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంటే రాబోయే రోజుల్లో పూరి జగన్నాథ్ నుంచి చాలా పవర్ఫుల్ సినిమాలు వస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే తనకు కథలు డిఫరెంట్ గా నమ్మకంగా అనిపించకపోతే విజయ్ అంత ఈజీగా సినిమాలు చేయడానికి ఒప్పుకోడు. ఇక పూరి జగన్నాథ్ తో ఈ రౌడీ స్టార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.