డైరెక్టర్ పూరి కి షాక్ ఇచ్చిన మెగా బ్రదర్స్..చిరు 150సినిమా డౌట్...!
అమితాబ్ బచ్చన్, పూరి జగన్నాథ్ ల 'బుడ్డా" ప్రీమియర్ షోలో ఎంతో ఆర్భాటంగా ఎనౌన్స్ అయిన చిరంజీవి 150వ సినిమా ఇక లేనట్టే అని సమాచారం. పూరి జగన్నాథ్ కి మెగా ఫ్యామిలీకి మధ్య సరైన సత్సంబంధాలు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ ప్రవర్థన వల్ల పూరి బాగా హర్ట్ అయ్యాడట. ప్రీమియర్ లో తనతో సినిమా చేస్తానని చిరంజీవి ప్రకటించగా మరుసటి రోజే నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి 150వ సినిమాకి ఎవరైనా మంచి కథ తెస్తే అవకాశమిస్తామని చెప్పడం పూరిని బాధించింది.
అందుకే ఈ సినిమా చెయ్యకూడదని డిసైడ్ అయ్యాడట. ఇప్పటి వరకూ సినిమాల్లో నటించాలా వద్దా అనే విషయంలో కూడా చిరంజీవికి క్లారిటీ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పూరి తను మహేష్ బాబుతో బిజినెస్ మేన్ తర్వాత చెయ్యబోయే లిస్ట్ బయటపెట్టాడు. హిందీలో రెండు సినిమాలు, రవితేజతో ఇడియట్2 చేస్తానని చెప్తున్నాడు. దీన్ని బట్టి చిరంజీవి, పూరి కాంబినేషన్ లో సినిమా లేదనేది స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











