»   » పదేళ్ల తర్వాత: ఎన్టీర్‌ మెచ్చిన పూరి స్టోరీ

పదేళ్ల తర్వాత: ఎన్టీర్‌ మెచ్చిన పూరి స్టోరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం 'ఆంధ్రావాలా'. 2004లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. గడిచిన పదేళ్ల కాలంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో అసలు సినిమానే రాలేదు. అయితే ఎట్టకేలకు పూరి చెప్పిన స్టోరీని ఎన్టీఆర్ ఒకే చేసాడని తెలుస్తోంది.

ఇటీవలే పూరి చెప్పిన స్టోరీ జూ ఎన్టీఆర్ ఓకే చేసాడని, వచ్చే నెలలోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ చేస్తున్న రభస చిత్రం అనుకోని కారణాలతో మరింత ఆలస్యం అవకాశం ఉందని, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ అనారోగ్య సమస్యలే ఇందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది.

Puri Jagannadh New film with Jr NTR

మరో వైపు పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రం చేస్తూ బిజీగా గడుపుతుండటంతో......ఈ గ్యాప్‌లో జూ ఎన్టీఆర్ తో సినిమాను ప్రారంభించబోతున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం.

ఏప్రిల్ నెలలోనే జూ ఎన్టీఆర్-పూరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలోనే ఈచిత్రానికి హీరోయిన్ ఎవరు? ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

English summary
NTR and Puri Jagannadh who earlier worked for Andhrawala film will team up again for yet another commercial entertainer and the regular shooting of this movie will commence from April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu