Puri Jagannadh: లైగర్, జనగణమన.. ఆ తరువాత అంతకుమించి పాన్ వరల్డ్ మూవీ

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఒక్కసారిగా తన స్టైల్ మార్చేశాడు అనే చెప్పాలి. గతంలో మాస్ కమర్షియల్ సినిమాలను చాలా వేగంగా పూర్తి చేసే పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో మాత్రం సరికొత్త ప్రణాళికలతో సినిమాలను పూర్తి చేస్తున్నాడు. మొత్తానికి లైగర్ సినిమా అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా జనగణమన అనే సినిమాను కూడా మొదలు పెట్టాలి అని పూరి జగన్నాథ్ ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులు అనంతరం అంతకు మించి అనేలా మరొక పాన్ వరల్డ్ సినిమాను తెరపైకి తీసుకు రావాలి అని పూరి జగన్నాథ్ ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

దాదాపు అందరి హీరోలతో..

దాదాపు అందరి హీరోలతో..

బద్రి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే స్టార్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితోనూ పూరి జగన్నాథ్ సినిమాలు చేశాడు సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా అందరి హీరోల ను తనదైన శైలిలో ప్రెజెంట్ చేశాడు.

 హీరోలు కూడా..

హీరోలు కూడా..

అప్పట్లో దాదాపు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు కూడా పూరి జగన్నాథ్ తో ఒక్క సినిమా చేసినా చాలు అని ఎంతో ఆశగా ఎదురుచూసే వాళ్ళు. ప్రత్యేకంగా పూరిని పిలిపించుకుని మరీ సినిమాలకు అగ్రిమెంట్ చేసేవారు. ఇక పూరి జగన్నాథ్ కూడా వీలైనంత వరకు ప్రతి హీరోకు ఒక స్పెషల్ మాస్ క్యారెక్టర్తో హైలెట్ అయ్యేలా చేశాడు.

 మొదటిసారి పాన్ ఇండియా

మొదటిసారి పాన్ ఇండియా

ఇక పూరి జగన్నాథ్ మొత్తానికి మొదటిసారి విజయ్ దేవరకొండ తో ఒక పాన్ ఇండియా సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు. లైగర్ అనే ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా పూరి జగన్నాథ్ తో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆగస్టులో సినిమా విడుదల కాబోతోంది

విజయ్ దేవరకొండతో మరో మూవీ

విజయ్ దేవరకొండతో మరో మూవీ

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను పూర్తి చేసిన వెంటనే పూరి జగన్నాథ్ తన భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. విజయ్ దేవరకొండ తోనే మరొక పాన్ ఇండియా సినిమా చేసేందుకు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ ఎప్పటి నుంచో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన అనే సినిమాను తెరపైకి తీసుకురావాలని చూస్తున్నాడు. ఇక ఆ ప్రాజెక్టు ను త్వరలోనే ఫినిష్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జాన్వి కపూర్ కూడా హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

 పాన్ వరల్డ్ ప్రాజెక్ట్?

పాన్ వరల్డ్ ప్రాజెక్ట్?


అయితే లైగర్ మూవీ జనగణమన ఇలా రెండు సినిమాలు కూడా పూర్తి అయిన తర్వాత పూరి జగన్నాథ్ పాన్ ఇండియా కాకుండా ఫ్యాన్ వరల్డ్ రేంజ్లో సినిమా చేయడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్ కేవలం హీరో క్యారెక్టర్ ను మాత్రమే కాకుండా కథలో కూడా ట్విస్టులు సరికొత్త అంశాలు కూడా హైలెట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక పాన్ వరల్డ్ రేంజ్లో ఆలోచిస్తున్నాడు అంటే తప్పకుండా అంతకుమించి అనేలా ప్రాజెక్టు సెట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఆ ప్రాజెక్టుపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X