బ్యాంకాక్‌లో పూరీ జగన్నాధ్ బిజీగా...
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని అతి తక్కువ సమయంలో తీసిన పూరి జగన్నాధ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్నారు. అక్కడ ఆయన అల్లు అర్జున్‌తో తీయనున్న 'ఇద్దరమ్మాయిలతో' స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. ఈ పనిమీదనే ఆయన రాత్రింబవళ్లు ఉన్నట్లు సమాచారం. పూరీ జగన్నాధ్, అల్లుఅర్జున్ కలయికలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో...'. గణేష్ బండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
దర్శకుడు పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ దేశముదురు తర్వాత బన్నీ కాంబినేషన్‌లో చేస్తున్న ఈ చిత్రానికి కథ బాగా వచ్చిందని, బన్నీ ఇద్దరమ్మాయిలతో చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రం ఆయన కెరీర్‌లో విభిన్న చిత్రంగా ఉంటుందని తెలిపారు. అల్లు అర్జున్ పూరీల మరో సెన్సేషనల్ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తమ సంస్థలో నిర్మించనున్నామని, మరో సూపర్‌హిట్ చిత్రం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నామని దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు.
అలాగే 'ఇద్దరు అమ్మాయిలతో..'చిత్రం షూటింగ్ మొత్తం అబ్రాడ్ లో జరపనున్నట్లు పూరీ జగన్నాధ్ తెలియచేసారు. 2013 జనవరికి విడుదల అయ్యే ఈ చిత్రం కథ కేవలం ట్రీట్ మెంట్ బేసెడ్ గా నడుస్తుందిని సమాచారం. ఇందులో బన్ని సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఇద్దరు అమ్మాయిలతో అల్లు అర్జున్ చేసే అల్లరినే ప్రత్యేకంగా ఫన్ తో కలిసి పూరీ స్క్రిప్టు రెడీ చేసాడని ఫిల్మ్ నగర్ సమాచారం. దాదాపు పెద్ద హీరోలందరూ చేసిన ఈ ఫార్ములా ఈ మధ్య కాలంలో ఎవరూ టచ్ చేయటం లేదు. దాంతో పూరీ ఈ పాయింట్ నే తన దైన శైలిలో బన్ని కి వినిపించి డేట్స్ ఓకే చేయించుకున్నారు. ఈ చిత్రంలో అమలాపౌల్,తాప్సీ హీరోయిన్స్ గా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











