పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ త్వరలో ఓ హిందీ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నట్లు సమాచారం. అందులో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర చేస్తారని తెలుస్తోంది. ఆ చిత్రానికి బుద్ద అనే టైటిల్ పెట్టారని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తారని అంటున్నారు. ఇక ఎంతో కాలంగా పూరీ జగన్నాధ్ హిందీ చిత్రాన్ని డైరక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పోకిరీ చిత్రం రీమేక్ ని అప్పట్లో అభిషేక్ బచ్చన్ తో ప్లాన్ చేసాడు. కానీ అప్పట్లో అబిషేక్ రిజెక్టు చేయటంతో అది ముందుకు వెళ్ళలేదు. అలాగే ఏక్ నిరంజన్ చిత్రం హిట్ అయితే ఈ సారన్నా ఈ ప్రాజెక్టుతో ముందకు వెళ్ళదామనుకున్నాడు.కానీ అది ఫెయిల్ కావటంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక ఈ బుద్ద ప్రాజెక్టుతో అయినా ఆయన నేషనల్ మార్కెట్ కు వెళ్ళాలని ఆశిద్దాం.
పూరీ జగన్నాధ్ అమితాబ్ బచ్చన్ రామ్ గోపాల్ వర్మ పోకిరి ఏక్ నిరంజన్ బుద్ద అభిషేక్ బచ్చన్ ప్రబాస్ puri jagannath amithab ram gopal varma pokiri ek niranjan abhishek


Click it and Unblock the Notifications