ఆ సీక్వెల్ తో గోపీచంద్, పూరీ జగన్నాధ్ మరోసారి
గతంలో పూరీ జగన్నాధ్, గోపీచంద్ కాంబినేషన్ లో గోలీమార్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందే అవకాశం ఉన్నట్లు సమాచారం.గోలీమార్ ఫ్లాప్ కావటంతో ఈ సారి ఎలాగయినా గోపీచంద్ తో హిట్ కొట్టాలని పూరీ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే గోలీమార్ లా ఈ సారి సీరియస్ సబ్జెక్టు కాకుండా.. ఫన్ తో సాగిపోయే చిత్రాన్ని ప్లాన్ చేయనున్నారు. పూరి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలించిన 'ఇడియట్'కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందే అవకాశం ఉందని తెలుస్తోంది. గోపీచంద్ బాడి లాంగ్వేజిని మార్చి పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ ని తీయనున్నాడని, ఈ మేరకు ఓ స్టోరీ లైన్ గోపీ కి చెప్పారని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఇక గోపీచంద్ కూడా వరస ఫ్లాఫ్ లతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో చేస్తన్న గోపీచంద్ ఆ తర్వాత యేలేటి చంద్రశేఖర్ దర్సకత్వంలో చేస్తారని వినపడింది. అయితే ఈలోగా పూరి ప్రాజెక్టు ముందుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పూరీ అమితాబ్ ప్రధాన పాత్రలో బుడ్డా చిత్రం చేస్తున్నారు. అంతేగాకుండా తన తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా తీస్తున్న సినిమాకు పూరి సంగీతం కూడా అందిస్తున్నాడు. అలాగే రానా హీరోగా 'నేను నా రాక్షసి' రూపొందించాడు. ఆ చిత్రం ఇటీవలే ఆడియో విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











