పూరి జగన్నాథ్ నెక్ట్స్ నందమూరి హీరోతో..ఎన్టీఆర్ కాదు

By Srikanya

Puri Jagannath to Direct Kalyan Ram!!
హైదరాబాద్‌: ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలతో చిత్రాలు చేసిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు మిడిల్ హీరోలతో వరస సినిమాలు చేయటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన తదుపరి చిత్రం కల్యాణ్ రామ్ తో చేసే అవకాసం ఉందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ తర్వాత విష్ణు మంచు తోనూ ఆయన సినిమా చేయనున్నారు. ఓం సినిమాతో ప్లాఫ్ లో ఉన్న కళ్యాణ్ రామ్ మళ్లీ ఫామ్ లోకి రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పూరి తో చేయటానికి ఆసక్తి చూపుతున్నారని వినికిడి.

ఇక ప్రస్తుతం నితిన్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం ఫస్ట్‌లుక్‌ నిన్న విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ''ప్రస్తుతం గోవాలో షెడ్యూల్‌ జరుపుతున్నామని ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తి అవుతుందని చెప్పారు. ఇదొక ప్రేమకథ. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. త్వరలోనే గీతాల్ని విడుదల చేస్తాము''అన్నారు.

ఒంట్లో మూడు వేల కేలరీల శక్తిని కరిగించుకొనేందు కోసం... ఒక గంటపాటు ముద్దు కావాలని అడిగాడు ఓ కుర్రాడు. మరి ఆ అమ్మాయి సమాధానమేమిటో మా చిత్రం చూస్తే తెలుస్తుందంటున్నారు పూరి జగన్నాథ్‌. ఆయన దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'హార్ట్‌ ఎటాక్‌'. నితిన్‌, అదాశర్మ జంటగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది.

నితిన్ ఈసినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. నితిన్‌ సరసన అదాశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: అమోల్‌ రాథోడ్‌, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X