ఫైనల్ గా పూరీ డైరక్ట్ చేయబోయే హీరో అతనే...
పూరీ జగన్నాధ్..బాలకృష్ణతో చేస్తున్నాడని, ఆ తర్వాత వెంకటేష్ తో చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఏవీ మెటీరియలైజ్ కాలేదు. కానీ ఇప్పుడు రాణా తో ఫైనల్ గా పూరీ జగన్నాద్ చిత్రం ఓకే అయినట్లు సమాచారం. నల్లమలపు బుజ్జి నిర్మాతగా రాణా హీరోగా ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక నల్లమలుపు బుజ్జి గత సంవత్సరకాలంగా మూడు నాలుగు ప్రాజెక్టులు మూవ్ చేద్దామని చూసారు. ఎన్టీఆర్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎమ్ ఎల్ ఎ చిత్రం, ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో గంగ..ది డాన్ చిత్రం, మొన్నటికి మొన్న సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రాణా హీరోగా చిత్రాలు ప్రారంభమవుతాయని అంతా అనుకున్నారు. దాని నిమిత్తం అడ్వాన్స్ లు,సిట్టింగ్ లు కూడా జరిగాయి. కానీ ఓకే కాలేదు. మొత్తానికి పూరీ...వెంకటేష్ కోసమని చెప్పిన కథ నచ్చి రాణా తో చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు అయినా ఆగకుండా ముందుకెళ్తుందనీ ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











