ఆ స్టార్ హీరోతో పూరీ జగన్నాధ్ కథ ఓకే చేయించుకున్నారా?
పూరీ జగన్నాధ్ ఈ సారి వెంకటేష్ తో చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అమితాబ్ తో అనుకున్న బుడ్డ ప్రాజెక్టు లేటయ్యేటట్లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ మేరకు పూరీ జగన్నాధ్ ఓ స్టోరీ లైన్ ని వెంకటేష్ కి వినిపించి ఓకే చేసుకున్నారు. ఈ కథ పూర్తిగా రాసుకోవటం కోసం ఆయన బ్యాంకాక్ ప్రయాణమయ్యారని సమాచారం. ఇక పూరీ జగన్నాద్, గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన గోలీమార్ ప్లాప్ తర్వాత ఆయన బాలకృష్ణతో అనుచరుడు అనే కథ వినిపించారు. కానీ ఆ కథ బాలయ్యకి నచ్చకపోవటంతో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. ఆ తర్వాత తమిళ హీరో సూర్యతో ది బిజెనెస్ మ్యాన్ కి సంబంధించిన పనుల్లో మునిగారు. కానీ అదీ రామ్ గోపాల్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో లేటయ్యేటట్లు ఉంది. దాంతో వెంకటేష్ తో ప్రాజెక్టు ఓకే చేయించుకున్నారు. ఇక వెంకటేష్ ప్రస్తుతం చంద్రముఖి షూటింగ్ లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











