వైయస్ జగన్ కి పూరీ జగన్ హ్యాండ్ ఇచ్చినట్లేనా?

By Srikanya

జయాపజయాలకు సంభందం లేకుండా వరస సినిమాలతో బిజీగా ఉన్న దర్శకుడు ఎవరూ అంటే పూరీ జగన్నాధ్ అని చెప్పాలి. ఆయన తాజా చిత్రం దేముడు చేసిన మనష్యులు ఆగస్టు 15న విడుదల అవుతోంది. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ తో చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం అక్టోబర్ 18ని ప్లాన్ చేసి వేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఇవి కాగానే అల్లు అర్జున్ తో అక్టోబర్ 18న ఇద్దరు అమ్మాయిలు చిత్రం ప్రారంభించి ఈ సంవత్సరమే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఇంతలా చేస్తున్న పూరీ జగన్నాధ్...వైయస్ రాజశేఖర్ రెడ్డిపై సినిమా గురించి మాత్రం ఎత్తటం లేదు.

హీరో రాజశేఖర్ తో లోకనాయకుడు అనే చిత్రం చేస్తానని,అది రాజశేఖర్ రెడ్డి బయోగ్రఫీగా ఉంటుందని పూరీ ప్రకటించారు. అయితే వైయస్ మూడో డెత్ ఏనవర్శరీ వస్తున్నా ఆ ప్రాజెక్టు గురించి ఎక్కడా ప్రస్తావన తేవటం లేదు. రెండు మూడు సార్లు జగన్ ఈ విషయమై జగన్నాద్ తో ప్రస్తావించాడని వార్తలు సైతం వచ్చాయి. అయితే ఎందుకనో కార్యరూపం దాల్చటం లేదు.

పూరీ జగన్నాధ్ సోదరుడు గణేష్... వైయస్ఆర్సీలో యాక్టివ్ మెంబర్, పూరీ ఇంటి పంక్షన్ లకు సైతం వైయస్ జగన్ వచ్చి వెళ్తుంటారు కానీ అతి ముఖ్యమైన ఈ ప్రాజెక్టు మాత్రం కార్య రూపం దాల్చటం లేదు. ఈ ప్రాజెక్టు కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎదురుచూస్తున్నారన్నది మాత్రం నిజం. ఆ మధ్యన ప్రచారంలో భాగంగా షర్మిల, విజయమ్మ కూడా వచ్చి పూరీ జగన్ ఇంట బస కూడా చేసారు. కానీ ఈ సినిమా విషయం మాత్రం ముందుకు వెళ్లలేదు. రాజశేఖర్ తో కాకపోతే మరో హీరోతో అయినా ఈ సినిమా పూర్తి చేయవచ్చు కదా అన్నది అభిమానులు మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X