పూరీ జగన్నాధ్, ఆయన హీరో ఇద్దరూ షాక్ లో...!?
రాణా, ఇలియానా కాంబినేషన్ రూపొందిన నేను..నా రాక్షసి చిత్రం ఈ శుక్రవారం విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షో కే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. మాట్ని నుంచి చాలా చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. దాంతో ఈ చిత్రంపై ఎంతో నమ్మకం పెట్టుకున్న పూరీ జగన్ కి, హీరో రాణాకి పెద్ద షాక్ కొట్టిన అనుభూతి ఎదురైంది. ఇక రాణా తండ్రి సురేష్ బాబు ఈ చిత్రంలో కొంత భాగం రీ షూట్ చేయమంటే పూరీ వినలేదుట. దాంతో ఆయన ఇప్పుడు తన జడ్జిమెంట్ కరెక్టు అయి ప్లాప్ అయినందుకు సంతోషించాలో, తన కొడుకు సినిమా ప్లాప్ అయినందుకు బాధపడాలో అర్దం కావటం లేదుట. ఇక నిర్మాత నల్లమలుపు బుజ్డి మొదటి నుంచి ఇలియానా సీన్ హైలెట్ అవుతుందని, ఆమెపై వచ్చే ఫైనల్ ట్విస్ట్ పండుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాట్ట. దాంతో ఆయన కూడా డైలమోలో పడిపోయాని వినిపిస్తోంది. ఇక ఇలియానా కూడా వరసగా ఫ్లాపులను ఎదుర్కొంటోంది. ఆమెకీ ఈ చిత్రం హిట్టు చాలా అవసరం. అయితే ఈ సినిమా ఆమెను పూర్తిగా నిరాశపరిచింది. ఆత్మహత్యల నేపధ్యంలో ప్రయోగం అంటూ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల పాలిట శాపం అంటున్నారు.


Click it and Unblock the Notifications











