పూరీ జగన్నాధ్ ఇన్వాల్వ్ మెంట్ తో దిల్ రాజుకి తలనొప్పి
హిందీలో విజయవంతమైన తను వెడ్స్ మను చిత్రం దిల్ రాజు తెలుగులో చేద్దామనుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ ని కంగనా రౌనత్ (అందులో హీరోయిన్) పూరీ జగన్నాధ్ ..అక్కడి వారితో మాట్లాడి దిల్ రాజుకి ఇప్పించారని సమాచారం. దాంతో పూరీ తనకు కావాల్సిన వారిని ఈ ప్రాజెక్టులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో దిల్ రాజు ఈ కొత్త ఇన్వాల్వ్ మెంట్ కు ఏం చెయ్యాలో అర్దం కాని డైలమోలో పడుతున్నారు. ఈ చిత్రంలో హీరోగా సునీల్ అయితే బావుంటాడా లేక సాయిరామ్ శంకర్ సూటవుతాడా అనేది దిల్ రాజు తేల్చుకోలేక పోతున్నట్లు సమాచారం. పూరీ జగన్నాధ్ ఆబ్లిగేషన్ తో సాయిరామ్ శంకర్ ని తీసుకుందామనుకుంటే మాధవన్ లా అమాయికమైన ఫేస్ తో ఉండే వ్యక్తి సునీల్ అని మిగతా టీమ్ అంటున్నారుట. అందులోనూ సాయిరామ్ శంకర్ కి బంపర్ ఆఫర్ తప్పించి తెలుగులో ఒక్క హిట్టూ లేదు. అతన్ని పెట్టుకుంటే మార్కెట్ పరిస్ధితి ఏమిటనేది దిల్ రాజు స్టైయిట్ ప్రశ్న.
అయితే కథలో కీలకమైన రౌడీ పాత్రకు సాయిరామ్ శంకర్ ని తీసుకుందాము..సునీల్ హీరోగానే ఉంచుదామని ప్రపోజల్ పెట్టారట. అయితే పూరీ జగన్నాధ్ నో అంటున్నాడని చెప్తున్నారు. అలాగే పూరీ అశోశియేట్ ని దర్శకుడుగా తీసుకోవాలని పూరీ చెప్తున్నాడు. మరో ప్రక్క ఛార్మిని హీరోయిన్ గా తీసుకోమంటున్నాడు. దాంతో దిల్ రాజు ఈ ప్రాజెక్టులో తాను చేయగలిగింది ఏముంది అన్న ఆలోచనలో పడుతున్నాడు. దిల్ రాజుకి సునీల్ ని హీరోగా పెట్టి నెగిటవ్ పాత్రకు నాని చేత చేయించాలని ఉంది. అలాగే శేఖర్ సూరి ని దర్శకుడుగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇక హిందీలో మాదిరిగానే తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ అదే రేంజిలో చేసి విజయం సాధించాలని నిర్మాత ఐడియా. ఇక తెలుగులో దిల్ రాజు తో పాటు ఈ రీమేక్ లో ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిలు కూడా కలుస్తున్నారు. కొత్తగా ఓ సంస్ధను ప్రారంభించి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో వున్నారు. అలా మొదలైంది విజయం సాధించటంతో అటువంటి రొమాంటిక్ కామిడీలకు గిరాకీ ఉంటుందనే ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











