ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పూరీ జగన్నాధ్
స్టార్ డైరక్టర్ పూరీ జగన్నాధ్ ఇచ్చిన మాటను మరోసారి నిలబెట్టుకున్న సంఘటన రీసెంట్ గా తెలియవచ్చింది. ఎందుకే రమణమ్మ పాటతో తన తమ్ముడు సాయిరామ్ శంకర్ బంపర్ ఆఫర్ చిత్రం నిలబెట్టిన రఘు కుంచేకు తను పెద్ద హీరోతో ఆఫర్ ఇస్తానని గతంలో ప్రామిస్ చేసారట పూరీ. అయితే ఆయనకే కాలం కలిసిరాక కాంబినేషన్ లతో ముందుకు వెళుతున్న ఆయన బిజినెస్ మ్యాన్ చిత్రం సూపర్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు.
తను రవితేజతో తర్వాత చేయనున్న దేముడు చేసిన మనుష్యులు చిత్రానికి రఘు కుంచెకు అవకాశమిచ్చారని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు రఘుకుంచె చాలా ఆనందంగా ఈ చిత్రం తనకు బ్రేక్ ఈవెంట్ చిత్రం కావాలని తన కెరీక్ కు ప్లస్ కావాలని ఎలాగైనా మ్యూజికల్ హిట్ చేయాలని తాపత్రయపడుతున్నారు. అంతా మరోసారి తమన్ కు ఈ అవకాశం ఇస్తారని భావిస్తూండగా పూరీ ఇలా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సినీ సర్కిల్స్ లో చర్చనీయాంసంగా మారారు. ఇక పూరీ జగన్నాధ్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం అనంతరం ఈ సినిమా ప్రారంభమవుతుంది. సినిమా మొత్తం హిలేరియస్ కామీడీతో ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











