Liger సినిమాను రిజెక్ట్ చేసిన హీరోల లిస్ట్ వైరల్.. ఆ స్టార్స్ ఎందుకు రిజెక్ట్ చేశారంటే?
టాలీవుడ్ రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో మరో రేంజ్ కి వెళ్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే లైగర్ సినిమా కథను విజయ్ దేవరకొండ ఓకే చేయడానికి ముందు ఆ కథ చాలా మంది హీరోల దగ్గరికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక లిస్టులో అగ్ర హీరోలు కూడా ఉన్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్ లైగర్ కథను ఇంతకుముందుకు ఎవరెవరికి చెప్పారు? వారు ఎందుకు ఒప్పుకోలేదు అనే వివరాల్లోకి వెళితే..

నమ్మకంతో..
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు అందుకున్న పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఏ హీరోతో అయినా సినిమా చేయాలి అంటే చాలా ఈజీగా కాంబినేషన్ సెట్ అయ్యేది. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఆయన సక్సెస్ రేట్ చాలా వరకు తగ్గిపోవడంతో చిన్న హీరోలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఇక ఆయన మీద నమ్మకంతో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేశాడు. ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ ట్రాక్లోకి వచ్చాడు అనుకున్న పూరి జగన్నాథ్ మళ్లీ లైగర్ తో తీవ్రంగా నిరాశపరిచాడు.

హార్డ్ వర్క్ చేసిన విజయ్
లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన శక్తిని అంతా ధారపోశాడు అనే చెప్పాలి. ఒక మంచి అవకాశం గా భావించి వర్కౌట్స్ కూడా చేశాడు. పూర్తిస్థాయిలో ఫిట్నెస్ లో మార్పులు తెచ్చిన విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే పూరి జగన్నాథ్ కథలో బలం లేకపోవడంతో సినిమా దారుణమైన టాక్ సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్ తో చర్చలు
ఇక గతంలో పూరి జగన్నాథ్ ఈ కథను కొంతమంది హీరోలతో కూడా చేయాలని అనుకున్నాడు. ముందుగా నందమూరి హీరో ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా చేసినప్పుడు ఆ తర్వాత బాక్సర్ అనే సినిమా కూడా చర్చల్లోకి వచ్చింది. లైగర్ కథకు మొదట బాక్సర్ అనే టైటిల్ ని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ అప్పుడు వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండడం వలన పూరి చెప్పిన లైన్ మీద పెద్దగా ఫోకస్ చేయలేకపోయాడు.

రామ్ చరణ్ కూడా..
ఇక ఎన్టీఆర్ అలా మిస్ కావడంతో పూరి జగన్నాథ్ ఆ తర్వాత రామ్ చరణ్ తేజ్ తో కూడా చేయాలని అనుకున్నాడు. రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక ఆ అనుబంధం తోనే పూరి రామ్ చరణ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు కానీ అక్కడ కూడా ప్లాన్ వర్కౌట్ కాలేదు. రామ్ చరణ్ కథలో అంతగా కొత్తదనం లేదు అని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

బన్నీ అలా అనేసరికి..
అసలైతే టైగర్ కథ అనుకున్నప్పుడు అందులో హీరోకు నత్తి ఉండాలి అనే ఆలోచన అల్లు అర్జున్ ఇవ్వడం వల్లే తనకు వచ్చింది అని పూరి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అయితే లైగర్ కథపై బన్నీతో కూడా చర్చలు జరిపాడట. కానీ అల్లు అర్జున్ ఇంకా కథలో కొత్తదనం ఉండాలి అని కమర్షియల్ ఎలిమెంట్స్ కాస్త తగ్గాలని కూడా సలహాలు ఇచ్చాడట. ఇక తర్వాత పూరి బన్నీతో చెప్పిన చెంజెస్ చేయకుండా విజయ్ లైగర్ కథకు కరెక్ట్ గా సెట్ అవుతాడని ఆలోచనతో ప్రాజెక్ట్ ఫిక్స్ చేశాడు. ఆ విధంగా బన్నీ ఈ ప్రాజెక్టు నుంచి మిస్ అయ్యాడు


Click it and Unblock the Notifications











