మరో బాలీవుడ్ మూవీకి చేయనున్న పూరి
బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రంపై సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తోంది. 'బుడ్డా హోగా తెరా బాప్' చిత్రంతో బాలీవుడ్లో అడుగు పెట్టిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే ఈ సినిమా రీమేక్ చేయాలని సల్మాన్ భావిస్తున్నాడట.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేస్తున్నారు. ఈచిత్రంలో అల్లు అర్జున్ సరసన అమలపాల్, కేథరిన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో పూరి స్టయిల్ లో ఈచిత్రం సాగుతుంది.
ఇద్దరు అమ్మాయిలతో ఫారిన్ లో ప్రేమలో పడి వారితో హీరో పడే పాట్లు... అనే పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.


Click it and Unblock the Notifications












