twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి 'లోఫర్‌' కథ, ఇన్ సైడ్ టాక్

    By Srikanya
    |

    హైదరాబాద్ : దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన 'లోఫర్‌' చిత్రం ఈ రోజున (డిసెంబర్ 17న) విడుదల అవుతోంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...అద్బుతం కాకపోయినా పూరి గత చిత్రాల కన్నా మెరుగ్గ ఉంటుందని అంటున్నారు. ఫస్టాఫ్ ఓకే అనిపించుకున్నా, అదిరిపోయే ఇంటర్వెల్, సెంటిమెంట్ తో సాగే సెకండాఫ్ నిలబెడతాయంటున్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ, రేవతి మధ్య వచ్చే సాంగ్ సినిమాకు హైలెట్ కానుందంటున్నారు. అలాగే ఈ చిత్రం గురించి ఓ కథ చెప్తున్నారు. అది నిజమా కాదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

    పోసాని కృష్ణ మురళి తన భార్య రేవతితో వచ్చిన విభేధాలతో కొడుకుని తీసుకుని ఆమెను వదిలేస్తాడు. జోధాపూర్ తీసుకు వెళ్ళి అక్కడ లోఫర్ గా పెంచుతాజు. అక్కడ అతను దిశా పటేల్ ని ప్రేమిస్తాడు. ఆమె కొంతకాలం క్రితం రేవతితో పరిచయం అయ్యి ఉంటుంది. దిశ ఈ లోగా కిడ్నాప్ కు గురి అవుతుంది. వరుణ్ తేజ ఆమెను సెర్చ్ చేస్తూంటాడు. ఈ క్రమంలో తన తల్లి రేవతిని కలుసుకుంటాడు. ఆమెతో ఉంటానని అడుగుతాడు. అయితే ఆమె దిశను వెతికిపెట్టమని కండీషన్ పెడుతుంది.

    అలా సినిమా నడుస్తూండగా ముఖేష్ రుషి...రేవతి సోదరుడు మెయిన్ విలన్ అని తేలుతుంది. అతని కూతురే దిశ. ఆమెను డబ్బున్న అలీ కి ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడు. అలీ కు మైన్స్ ఉంటాయి. వాటిని సొంతం చేసుకోవానలనేది అతని ఆలోచన. అలీ సెకండాఫ్ లో మాత్రమే కనపడతాడు. బ్రహ్మానందం కూడా సెకండాఫ్ లో అదీ పది నిముషాలు మాత్రమే కనపడతాడు. చివరకు దిశను ఎలా సొంతం చేసుకున్నాడు. తల్లి అతన్ని ఏక్సెప్టు చేసిందా వంటి విషయాలు క్లైమాక్స్ లో తెలుస్తాయి. అయితే ఇదంతా కేవలం ప్రచారంలో ఉన్న కథ మాత్రమే.

    Puri Jagannath's Loafer Story&inside talk

    పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.... భర్త మీద కోపంతో తల్లి తన కొడుకుని కావాలనే లోఫర్‌గా పెంచుతుంది. టైటిల్‌ 'లోఫర్‌' అయినంత మాత్రాన సినిమా అలా ఉండదు. ఇందులో అమ్మ చని పోయిందని కొడుకు (హీరో) చెబుతాడు. కొడుకు చని పోయాడని తల్లి చెబుతుంది. తండ్రి చనిపోయాడని కొడుకు చెబుతాడు. ఒకరిపై ఒకరు ఇలా చెప్పుకుంటారు. కాని అందరూ బతికే ఉంటారు. ఒక్క మదర్‌ సెంటిమెంట్‌ తప్ప దీనికి 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి'కి పోలికే లేదు. ఇందులోని మదర్‌సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. అన్నారు.

    అలాగే వరుణ్‌తేజ్‌లోని మాస్‌ యాంగిల్‌ చూసి తీసుకున్నారా మాత్రమే కాక అతనిలోని ఇన్నోసెంట్‌ నచ్చింది. ఇందులోని పాత్రకు అలాంటి కుర్రాడే కావాలి. వరుణ్‌ మనం ఎలా చెబితే అలానే చేస్తాడు. జెన్యూన్‌గా ఉండడం, అతని ఇన్నోసెంట్‌ ఫేస్‌ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది. మూడో సినిమాకే ఇంత బాగా చేశాడా అనిపించుకున్నాడు.

    Puri Jagannath's Loafer Story&inside talk

    ముఖ్యంగా మదర్‌ సాంగ్‌లో అద్భుతంగా నటించాడు. ఇటీవల చిరంజీవిని కలిసి వీడియో క్లిప్‌ చూపిస్తే, 'వరుణ్‌ ఇంత బాగా చేశాడా' అని పది నిమిషాల పాటు మాట్లాడారు. ఇక తల్లీదండ్రులుగా పోసాని, రేవతి అదరగొట్టారు. మంచి తల్లి, చెడ్డ తండ్రి మధ్య వచ్చే క్లాష్‌ ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు.

    వరుణ్‌తేజ్‌, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముకేష్‌ రుషి, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌, శాండీ, ధనరాజ్‌టార్జాన్‌, చరణ్‌దీప్‌, వంశీ, రమ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: పి.ఎ.కుమార్‌ వర్మ, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: కె.యస్‌.రాజు, గల్లా రమేష్‌, కిషోర్‌ కృష్ణ, కో డైరెక్టర్‌: శివరామకృష్ణ, కో రైటర్స్‌: కళ్యాణ్‌ వర్మ, కిరణ్‌, ఫైట్స్‌: విజయ్‌, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్‌: విఠల్‌ కోసనం, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సమర్పణ: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, నిర్మాతలు: సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

    English summary
    Naga Babu's son Varun Tej is getting ready to show his mass power with Loafer directed by Puri Jagannath on Dec 17th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X